YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
- వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు..
- రేపల్లెపై జగన్ ప్రత్యేక ఫోకస్
- యువ నాయకుడు మోహన్‌పై ప్రశంసలు
- శ్రీనుకు కీలక హామీ ఇచ్చిన జగన్
- కార్యకర్తలే పార్టీకి అసలైన బలం: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపల్లె కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో శ్రీనివాసరావు వైసీపీ పార్టీలో చేరారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో శ్రీనివాసరావుకు వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రేపల్లె నియోజకవర్గ రాజకీయాలపై , పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపల్లె నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన జగన్, అక్కడ మోహన్ అనే యువకుడి పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. మోహన్ ఎంతో ఉత్సాహవంతుడని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడని జగన్ కొనియాడారు. యువత రాజకీయాల్లోకి రావడం పార్టీకి కొత్త జవజీవాలను ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా శ్రీను పాత్రను జగన్ ప్రస్తావిస్తూ, మోహన్‌ను తన సొంత తమ్ముడిగా భావించి అతని గెలుపు కోసం శ్రీను కృషి చేస్తున్న తీరును అభినందించారు. శ్రీను స్వయంగా మోహన్ గెలుపు బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నాడని, ఈ ప్రయాణంలో తాను కూడా శ్రీనుకు తోడుగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, శ్రీను కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుందని, అతనికి గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగిస్తానని జగన్ స్పష్టం చేశారు.
Also Read
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
సమావేశానికి భారీగా తరలివచ్చిన ప్రజలు, నాయకులు , కార్యకర్తలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ, అందరినీ వ్యక్తిగతంగా కలవడం సాధ్యం కాకపోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అవకాశం ఉన్నప్పుడల్లా క్షేత్రస్థాయి కార్యకర్తలను తన వద్దకు తీసుకురావాలని శ్రీను, మోహన్‌లకు సూచించారు. తన మీద నమ్మకం ఉంచి పార్టీ విజయం కోసం పగలు రేయి కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు, సోదరులకు, అక్కాచెల్లెమ్మలకు , పెద్దలకు జగన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని ఆయన పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!