Air Show: పోర్చుగల్ ఎయిర్ షోలో రెండు విమానాలు ఢీ, పైలట్ మృతి.. వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Show: ఐరోపా దేశమైన పోర్చుగల్‌లో జరిగిన ఎయిర్ షోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ షోలో భాగంగా గాల్లో విన్యాసాలు చేసే క్రమంలో రెండు విమానాలు పరస్పరం ఢీకొనగా.. ఓ పైలట్ మృతి చెందారు. మరో విమానంలోని పైలట్ గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పోర్చుగల్‌లోని బెజా విమానాశ్రయంలో ఎయిర్ షోలో డజన్ల కొద్ది మిలటరీ విమానాలు, హెలికాప్టర్లు పాల్గొన్నాయి. సుమారు 30 ఏరోబాటిక్ బృందాలతో ఎయిర్ షో ప్రారంభమైంది. పైలట్లు తమ సాహసాలను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆరు విమానాలు గాల్లో ప్రదర్శన చేస్తున్నాయి. అందులో ఓ విమానం మరోదానిని ఢీకొట్టింది. దీంతో అది కుప్పకూలిపోయింది.
Read Also: Encounter: పుల్వామాలో బలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఈ ఘటనలో స్పెయిన్‌కు చెందిన పైలట్ అక్కడికక్కడే మరణించగా.. పోర్చుగల్ కు చెందిన మరో పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని బెజా దవాఖానకు తరలించామని ఎయిర్‌ఫోర్స్ అధికారులు తరలించారు. ప్రమాదానికి గురైన విమానాలు యాకొవెల్వ్ యాక్-2 అని, అవి సోవియట్ డిజైన్డ్ ఏరోబేటిక్ ట్రైనింగ్ మోడల్‌కు చెందినవని వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతోషకరమైన సందర్భం కాస్తా విషాదంగా మారిందన్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడతామని పోర్చుగల్ రక్షణ మంత్రి నునో మెలో తెలిపారు. ప్రమాదానికిగల సరైన కారణం ఏమిటో అప్పుడే తెలుస్తుందన్నారు. పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో మాట్లాడుతూ సరదాగా, సంతోషంగా సాగాల్సిన సమయం కాస్తా విషాదాంతంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ షోను నిర్వాహకులు సస్పెండ్ చేశారు.
Beja Air Show accident 😨😞 DEP pic.twitter.com/4WrRfoLCeO
— Don Expensive 🇪🇦 ✞ 🐸 (@kar0____) June 2, 2024
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!