బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం యువతి అత్యాచారం, హత్య కేసును 48 గంటల్లోపే పోలీసులు ఛేదించారు. కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు దేవరకొండ విజయ్, కారంకి మహేష్, దేవరకొండ శ్రీకాంత్‌లుగా గుర్తించారు.
బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(శనివారం) భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేంద్ర బడ్జెట్ ముందస్తు సన్నాహక సమావేశానికి ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. ఈ క్రమంలో స్థూలంగా రాష్ట్రానికున్న అవసరాలు, కేంద్రం నుంచి ఆశిస్తున్న ఆర్థిక సహాయం గురించి ఈ సమావేశంలో ప్రస్తావించినట్లు ఏపీ ఆర్థిక మంత్రి వెల్లడించారు.
వచ్చేవారంలో పిఠాపురంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాలు తర్వాత తొలిసారి నియోజకవర్గానికి రానున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ భేటీ జరుగుతోంది. ఈ భేటీకి తెలుగుదేశం ఎంపీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. తొలి పార్లమెంటరీ పార్టీ భేటీ కావటంతో సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
ఓ బాలిక మిస్సింగ్ కేసులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని... ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది.
మహారాష్ట్రలోని అమరావతిలో ఎయిర్ ఇండియా ఫ్లయింగ్ స్కూల్‌ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ ఫ్లయింగ్ స్కూల్‌లో ప్రతి సంవత్సరం 180 మంది పైలట్లకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. పైలట్ల కొరతను ముందే ఊహించి, ఎయిర్ ఇండియా మహారాష్ట్రలోని అమరావతిలో ఏడాదికి 180 మంది పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఒక ఫ్లయింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ రోజుల్లో ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో షాపింగ్ చేసే ట్రెండ్ బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి చెందిన ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతోంది. చాలా మంది వినియోగదారులు ఆన్‌లైన్ ఆర్డర్‌లు త్వరగా లేదా ఇచ్చిన తేదీలో డెలివరీ చేయబడలేదనే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫ్లిప్‌కార్ట్ వచ్చే నెలలో భారీ ప్రారంభానికి సిద్ధమవుతోంది. వాస్తవానికి ఫ్లిప్‌కార్ట్ తన కొత్త సర్వీస్ ‘ఫ్లిప్‌కార్ట్ మినిట్స్’ని జులై 15న ప్రారంభించవచ్చు.
కొలెస్ట్రాల్ పెరగడం తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. కొలెస్ట్రాల్ మీ రక్తంలో కనిపించే మైనపు పదార్థం. మీ కాలేయం కొలెస్ట్రాల్‌ను స్వయంగా తయారు చేస్తుంది లేదా మీరు తినే, తాగే వాటి నుంచి అది పేరుకుపోతుంది. శరీరానికి ఆరోగ్యంగా ఉండటానికి కొలెస్ట్రాల్ అవసరం, కానీ దాని స్థాయి పెరిగినప్పుడు, అది అనేక తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుంది
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు.
ఏపీ విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 3వ బ్లాక్‌లో బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విద్యుత్ వ్యవస్థ మీద చాలా పట్టు ఉందని, ఆయన ఈ రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారన్నారు.