Deputy CM Pawan Kalyan: ఓ బాలిక మిస్సింగ్ కేసులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని… ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని వేదన చెందారు. జాడ తెలిశాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకి ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్‌కు పంపించారు.
Read Also: Heavy rainfall warning: తెలుగు రాష్ట్రాల సహా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
#JanaVaani #PawanKalyanAneNenu
మిస్సింగ్ కేసు పై స్వయంగా రంగంలోకి దిగిన ఉప ముఖ్యమంత్రి
విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అనీ… ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప… pic.twitter.com/NNMZtUOQuC
— JanaSena Party (@JanaSenaParty) June 22, 2024