సినీ పరిశ్రమలో చాలా మంది తారలు అరుదైన వ్యాధిని ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అనుష్క శెట్టి కూడా అరుదైన వ్యాధితో బాధపడుతోంది.
బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ మధ్య తగాదాల గురించి మీరు చాలా కథలు విన్నారు, కానీ న్యూజిలాండ్‌లోని ఒక మహిళ ఈ వివాదాన్ని వేరే స్థాయికి తీసుకువెళ్లింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో ప్రేమికుడిపై కేసు పెట్టింది.
విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర తీరంలో గడిపేందుకు వచ్చిన ఇద్దరు యువకులు సముద్రంలో మునిగి మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరం వద్ద చోటుచేసుకుంది.
ఎయిర్ కండీషనర్ అనేది ఒకసారి కొన్నది చాలా కాలం పాటు ఉపయోగించబడుతుంది. అందుకే మన అవసరాలకు తగినట్లుగా సరైన యూనిట్‌ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. దాని పనితీరును ఎక్కువ కాలం కొనసాగించడానికి దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. దీనితో పాటు ఎయిర్ కండీషనర్‌ను మార్చడానికి సమయం ఆసన్నమైందో లేదో తెలుసుకోవడం కూడా ముఖ్యం.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సకుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్పీకర్‌కు ఆలయ ఈఓ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఏపీలోని పలు జిల్లాల్లో డయేరియా కలకలం సృష్టిస్తోంది. కాకినాడ జిల్లాలో డయేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు డయేరియా బాధితుల సంఖ్య 210కి చేరగా.. ఆస్పత్రుల నుంచి140 మంది డిశ్చార్జ్ అయ్యారు. డయేరియాతో కొమ్మనాపల్లికి చెందిన నాగమణి, వేట్లపాలెంకు చెందిన సత్యవతి అనే ఇద్దరు మహిళలు మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఏపీలో భారీగా కలెక్టర్లను బదిలీలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మి నియామకం కాగా.. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రస్తుత గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి ఆదేశాలు జారీ అయ్యాయి.
అటవీ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కట్టడిపై ఫోకస్ పెట్టాలని పవన్ ఆదేశించారు. ఇతర దేశాలకు అక్రమంగా ఎర్రచందనం తరలింపుపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు.
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం బంగారమ్మపేటలో మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. బంగారమ్మపేట గ్రామానికి చెందిన వివాహిత తాడితూరి అనూష (20) అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతి చెందింది.