జనగామ కలెక్టర్ కార్యాలయం పైకెక్కి పురుగుల మందు తాగి ఓ రైతు హల్ చల్ చేశాడు. జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నర్సయ్య అనే రైతు చాలా కాలంగా అధికారులు తన 4 ఎకరాల భూ వివాదం పరిష్కరించకపోవడంపై విసుగు చెందాడు. పరిష్కారం కోసం చెప్పులరిగేలా కార్యాలయం చుట్టూ తిరిగి నర్సయ్య విసుగుచెందాడు.
ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తున్నారని.. ఇది చారిత్రక నిర్ణయమని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. కేటీఆర్ అసలైన కోతల మాస్టర్ అని.. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం కేసీఆర్, కేటీఆర్‌లకు ఇష్టం లేనట్లుందని ఆయన విమర్శించారు.
గోషామహల్ ప్రజలకు ఎమ్మె్ల్యే రాజా సింగ్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డబుల్ బెడ్ రూం దరఖాస్తు దారులకు ఫేక్ కాల్స్ చేస్తూ.. అజ్ఞాత వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని.. ఫేక్ కాల్స్‌కు ప్రజలు ఎవరు స్పందించవద్దని సూచన చేశారు.
బాపట్ల జిల్లా రామాపురం బీచ్‌లో వరుస ప్రమాదాలపై జిల్లా మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. వరుస ప్రమాదాలు జరుగుతూ ముక్కుపచ్చలారని యువకులు చనిపోతుంటే ఎందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టట్లేదని అధికారులను మంత్రి నిలదీశారు.
నంద్యాలలో దారుణం జరిగింది. వేధింపులు తాళలేక కట్టుకున్న భర్తను భార్య కత్తితో పొడిచి హత్య చేసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నంద్యాలకు చెందిన వెంకటేశ్, మమత భార్యాభర్తలు. వెంకటేష్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. భార్య భర్తల మధ్య కొన్ని నెలలుగా విభేదాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిజానికి నీట్, నెట్ వంటి ముఖ్యమైన పరీక్షల్లో అక్రమాలు జరిగిన తర్వాత ఈ పరీక్షలను నిర్వహించే సంస్థ (ఎన్‌టీఏ) విశ్వసనీయతపైనా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఎన్టీఏ అంటే ఏమిటి?, అది ఎలా పని చేస్తుంది, దాని గురించి ఎందుకు వివాదం ఉందనే విషయాలను తెలుసుకుందాం.
ఈడీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అని కూడా అంటారు. దేశంలో ఏదైనా స్కామ్ లేదా రైడ్‌లో ఈడీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఈడీలో ఉద్యోగం ఎలా పొందాలో తెలుసా? మీరు ఈడీలో పని చేయాలనుకుంటే, ఈ కథనం మీ కోసం. ఈడీలో పని చేయడానికి అర్హతలు, జీతం, ప్రక్రియ గురించి ఇక్కడ తెలుసుకోండి.
చాలా మంది పునర్జన్మ గురించి వాదోపవాదాలు చేస్తుంటారు. కొందరు పునర్జన్మ ఉందని, మరికొందరు అలాంటిదేం లేదని వాదిస్తుంటారు. కానీ ఐదేళ్ల అమ్మాయి మాటలు వింటుంటే పునర్జన్మ ఉంటుందనే అనే నమ్మకం కలుగుతోంది. పునర్జన్మ కథకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఐదేళ్ల బాలిక ఇది తన పునర్జన్మ అని పేర్కొంది. ఆమె గత జన్మలో ఎలా చనిపోయిందో, ఎక్కడ నివసించారో కూడా చెబుతోంది.
ఈ రోజుల్లో ఆల్కహాల్ తాగడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఏ చిన్న కార్యక్రమమైనా, ఎవరి బర్త్‌డే వేడుకలైనా సరే.. మద్యం బాటిల్‌ను తెరవడం తప్పనిసరి అయిపోయింది. నేటి యుగంలో గెట్-టుగెదర్‌లు, పార్టీలలో మద్యం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీకెండ్ల కోసం ఎంతో మంది ఎదురుచూసేది ఈ ఆల్కహాల్ కోసమే. కానీ మద్యం తాగడం వల్ల శరీరంపై ఎన్నో ప్రతికూల ప్రభావాలు కూడా పడతాయి.