Cholesterol: ప్రతి ఏడాది కొలెస్ట్రాల్ వల్ల 44 లక్షల మంది మరణిస్తున్నారు.. తగ్గించే మార్గాలు ఇవే!
- కొలెస్ట్రాల్ పెరగడం తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది
- ప్రతి ఏడాది కొలెస్ట్రాల్ వల్ల 44 లక్షల మంది మరణిస్తు్న్నారు
- శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే మార్గాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cholesterol: కొలెస్ట్రాల్ పెరగడం తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. కొలెస్ట్రాల్ మీ రక్తంలో కనిపించే మైనపు పదార్థం. మీ కాలేయం కొలెస్ట్రాల్‌ను స్వయంగా తయారు చేస్తుంది లేదా మీరు తినే, తాగే వాటి నుంచి అది పేరుకుపోతుంది. శరీరానికి ఆరోగ్యంగా ఉండటానికి కొలెస్ట్రాల్ అవసరం, కానీ దాని స్థాయి పెరిగినప్పుడు, అది అనేక తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, అది గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ (WHF) ప్రకారం, అధిక కొలెస్ట్రాల్ ప్రతి సంవత్సరం 4.4 మిలియన్ల మరణాలకు కారణమవుతుంది, ఇది మొత్తం మరణాలలో 7.8 శాతంగా ఉంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించే మార్గాలు ఏమిటో మనం తెలుసుకుందాం.
Read Also: Tomato prices: టమాటా ధరలకు మళ్లీ రెక్కలు.. సెంచరీ కొట్టిన కిలో ధర
Also Read
- AP High Court: విజయ డెయిరీ బోర్డుకు హైకోర్టు షాక్.. చైర్మన్ సహా ఐదుగురి ఎన్నిక చెల్లదు..!
- TDP vs YSRCP: గుడివాడ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీలో చేరిన టీడీపీ నేత
- Vizag Crime: ఇన్‌స్టా పరిచయంతో ఇంట్లోకి ఎంట్రీ.. బంగారం, వజ్రాల నగలతో పరారీ..!
- Varanasi Update: ఆ ఎద్దు మీద మహేష్‌ను చూసి ఏడాది అయింది.. మరో అప్డేట్ అయినా ఇవ్వండి సార్..!
కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధం
వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రకారం, స్టాటిన్స్ వంటి కొన్ని మందులు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో లేదా దాని నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. అయితే మీరు మీ జీవనశైలిని మెరుగుపరచడం ద్వారా కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించవచ్చు.కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలంటే ఖాళీ కడుపుతో ఈ పండ్లను తినండి. ముఖ్యంగా బరువు తగ్గించే బొప్పాయి, జామ, ఆపిల్, స్ట్రాబెరీ, ఆరెంజ్, అవకాడో వంటి పండ్లను తీసుకోవడం వల్ల పండ్లు చెడు కొలెస్ట్రాల్‌ను పెరగకుండా నియంత్రిస్తాయి. మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా పండ్లు ఎంతగానో దోహదం చేస్తాయి. పండ్లలో పుష్కలంగా ఉండే విటమిన్లు, మినరల్స్ మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. బరువు తగ్గాలి, శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకోవాలి అని భావించే వారు కార్బోహైడ్రేట్లను ఆహారంలో తక్కువగా తీసుకోవాలి.
మీ ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడే వాటిని పూర్తిగా తగ్గించండి. మీ ఆహారంలో వీలైనంత ఎక్కువ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉపయోగించాలి. ఆహారంలో తక్కువ మాంసాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే ఇందులో ఉండే కొవ్వు కొలెస్ట్రాల్ మొత్తాన్ని వేగంగా పెంచుతుంది. బదులుగా, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను తినండి. అంతే కాకుండా బరువును అదుపులో ఉంచుకోవాలి. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రకారం, కొలెస్ట్రాల్‌ను నివారించడానికి, దానిని తగ్గించడానికి ధూమపానానికి దూరంగా ఉండాలి. ఇది కాకుండా, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలంటే ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని సంస్థ సలహా ఇస్తుంది. అంతే కాకుండా ఒత్తిడికి దూరంగా ఉండాలి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడం కష్టమని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, కానీ వాస్తవానికి ఇది మీ కొలెస్ట్రాల్‌ను తనిఖీ చేయడంతో ప్రారంభమవుతుంది. మీ దేహంలో కొలెస్ట్రాల్ లెవెల్ ఎలా ఉందో చెక్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీరే మారే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Ramayana Box Office Collections: ‘రామాయణ’ రికార్డుల వేట.. ‘ధురంధర్ 2’ మరో రికార్డు బద్దలు!
-
AP High Court: విజయ డెయిరీ బోర్డుకు హైకోర్టు షాక్.. చైర్మన్ సహా ఐదుగురి ఎన్నిక చెల్లదు..!
-
Thailand Phuket Fire Accident: థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 17 మందికి గాయాలు!
-
King 100: కెరీర్లో ఇప్పటివరకు టచ్ చేయని ఫీట్.. ఈసారి ‘కింగ్’ కొట్టేస్తాడా?
-
TDP vs YSRCP: గుడివాడ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీలో చేరిన టీడీపీ నేత
ట్రెండింగ్
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!