Pawan Kalyan: ఎన్నికల తర్వాత తొలిసారి పిఠాపురం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- వచ్చేవారంలో పిఠాపురంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం
- ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి నియోజకవర్గంకు రానున్న పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: వచ్చేవారంలో పిఠాపురంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.
ఎన్నికల ఫలితాలు తర్వాత తొలిసారి నియోజకవర్గానికి రానున్నారు. స్థానిక సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. సమగ్ర సమాచారంతో సమావేశానికి రావాలని అధికారులకు క్లారిటీ ఇచ్చారు.
Read Also: TDPP Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీపీ భేటీ
Also Read
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి గెలిచిన పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ కూర్పులో భాగంగా పవన్ కల్యాణ్‌కు ఏపీ ఉపముఖ్యమంత్రిగా ప్రత్యేక గౌరవం దక్కింది. డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను సీఎం చంద్రబాబు కేటాయించారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన వచ్చేవారం పిఠాపురంలో పర్యటించనున్నారు. తనను అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలుసుకొని నియోజక వర్గంలో పర్యటిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, స్థానిక కార్యకర్తలను తనే స్వయంగా వచ్చి కలుస్తానని, ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటించే కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!