TDPP Meeting: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ భేటీ జరుగుతోంది. ఈ భేటీకి తెలుగుదేశం ఎంపీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. తొలి పార్లమెంటరీ పార్టీ భేటీ కావటంతో సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. టీడీపీ పార్లమెంటరీ నేతగా ఎవరిని నియమిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఈసారి లోక్ సభలో టీడీపీకి 16 ఎంపీల బలం ఉంది. ఈ నెల 24నుంచి ప్రారంభమయ్యే లోక్‌సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ కేంద్ర నిధులు తీసుకొచ్చేలా ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు.
Read Also: Deputy CM Pawan Kalyan: మిస్సింగ్ కేసుపై స్వయంగా రంగంలోకి దిగిన ఉప ముఖ్యమంత్రి