Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎ పవన్ కల్యాణ్ సహా పలువురు కూటమి సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడు చాలా సీనియర్ నేత అని, రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన నేత సభాపతి స్థానంలో కూర్చోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పవన్ తన ప్రసంగంలో హాస్యాన్ని జోడించి తనదైన శైలిలో అయ్యన్నపాత్రుడిని ప్రశంసించారు. దీంతో సభలో నవ్వులు పూశాయి. అసెంబ్లీలో పవన్ తొలి ప్రసంగం వీడియో మీ కోసం..