Chirala: ఈపూరుపాలెం యువతి హత్య కేసును 48 గంటల్లోపే ఛేదించిన పోలీసులు
- బాపట్ల జిల్లా ఈపూరుపాలెం యువతి హత్య కేసును 48 గంటల్లోపే చేధించిన పోలీసులు
- కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
- నిందితులు దేవరకొండ విజయ్..కారంకి మహేష్.. దేవరకొండ శ్రీకాంత్‌గా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chirala: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం యువతి అత్యాచారం, హత్య కేసును 48 గంటల్లోపే పోలీసులు ఛేదించారు. కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు దేవరకొండ విజయ్, కారంకి మహేష్, దేవరకొండ శ్రీకాంత్‌లుగా గుర్తించారు. నిన్న(శుక్రవారం) బహిర్భూమికి వెళ్ళిన యువతిపై యువకులు అత్యాచారం చేసి హత్య చేశారు. గంజాయి మత్తులో అఘాయిత్యానికి ఒడిగట్టిన ఇద్దరు యువకులు, వారికి సహకరించిన మరో యువకుడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిని అత్యాచారం చేసిన అనంతరం హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. కేసును స్వయంగా బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షించారు. యువకులు అదే గ్రామానికి చెందిన రౌడీషీటర్లు కాగా.. పోలీసుల విచారణలో హత్యను ఆ యువకులు ఒప్పుకున్నారు. వివరాలను బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు.
Read Also: Minister Payyavula Keshav: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఏం కావాలో ప్రతిపాదనలు ప్రస్తావించాను..
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
అసలేం జరిగిందంటే..
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన సుచరిత(21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కూతురు ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో వెతుకుతూ వెళ్లిన తల్లికి స్థానిక గర్ల్స్ హైస్కూల్ సమీపంలో కుమార్తె సుచరిత మృతదేహం కనిపించింది. ఈ క్రమంలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం సుచరిత హత్య గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. వెంటనే ఘటన ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని, ప్రభుత్వం తరపున మృతురాలి కుటుంబానికి అండగా ఉండాలని హోంమంత్రికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు సీఎం చంద్రబాబు. దర్యాప్తులో అలసత్వం లేకుండా.. జాప్యం జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో హత్య జరిగిన ఈపూరుపాలెంకు హోంమంత్రి అనిత వెళ్లారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా.. స్థానిక ఎమ్మెల్యే ఆ కుటుంబానికి అందజేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో విచారణ చేపట్టిన పోలీసులు.. ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!