Crime News: నంద్యాలలో దారుణం జరిగింది. వేధింపులు తాళలేక కట్టుకున్న భర్తను భార్య కత్తితో పొడిచి హత్య చేసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నంద్యాలకు చెందిన వెంకటేశ్, మమత భార్యాభర్తలు. వెంకటేష్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. భార్య భర్తల మధ్య కొన్ని నెలలుగా విభేదాలు నెలకొన్నాయి. రెండు రోజుల నుంచి ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం కూడా తాగి వచ్చాడు. తప్పతాగొచ్చి తన భార్యతో గొడవపడ్డాడు. ఆ మైకంలో భార్యను తీవ్రంగా కొట్టాడు. భర్త తరచూ తాగి ఇబ్బందులు పెడుతుండడంతో క్షణికావేశంలో అతని గుండెల్లో కత్తితో పొడిచింది. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్న వెంకటేశ్‌ను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే వెంకటేష్ మృతి చెందాడు. భార్య మమత పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Read Also: Viral video: రీల్స్ కోసం బరితెగింపు.. సముద్రంలోకి వాహనాలు తీసుకెళ్లి ఏం చేశారంటే..!
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం ఆబాక గ్రామంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త ఉదయ్ తాగి వచ్చి భార్య మస్తానమ్మతో గొడవపడి దాడికి పాల్పడ్డాడు. అడ్డు వచ్చిన అత్తను కూడా కొట్టగా.. తాగుబోతు భర్త బాధలు తాళలేక స్టవ్ మీద వడలు తయారుచేస్తున్న సల సల కాగుతున్న నూనెను భర్తపై పోసింది భార్య మస్తానమ్మ. భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్సకోసం సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకోసం నెల్లూరు ప్రభుత్వసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.