NTA: ఎన్టీఏ పని ఏమిటి?.. ఇక్కడ ఉద్యోగం ఎలా సాధించాలి?
- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ
- ఎన్టీఏ ఎలా పని చేస్తుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTA: ప్రస్తుతం ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిజానికి నీట్, నెట్ వంటి ముఖ్యమైన పరీక్షల్లో అక్రమాలు జరిగిన తర్వాత ఈ పరీక్షలను నిర్వహించే సంస్థ (ఎన్టీఏ) విశ్వసనీయతపైనా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఎన్టీఏ అంటే ఏమిటి?, అది ఎలా పని చేస్తుంది, దాని గురించి ఎందుకు వివాదం ఉందనే విషయాలను తెలుసుకుందాం.
ఎన్టీఏ అంటే ఏమిటి?
ఎన్టీఏ అనేది దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్, స్కాలర్‌షిప్‌ల కోసం ప్రవేశ పరీక్షలను నిర్వహించే స్వయంప్రతిపత్త సంస్థ. ఇది నవంబర్ 2017లో స్థాపించబడింది.
Also Read
- SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
- SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
- Off The Record: ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
- Off The Record: జీహెచ్ఎంసీలో ముద్ర కోసం ప్రభుత్వ ప్రయత్నాలు.. కార్పొరేషన్స్ ఎన్నికలపై దృష్టి.!
ఎన్టీఏ విధులు, లక్ష్యాలు
ఈ పరీక్షలను పారదర్శకంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించడం ఎన్టీఏ యొక్క పని. ఇది కాకుండా ఈ పరీక్షల కోసం ప్రశ్నలను ఎంచుకోవడానికి నిపుణులను ఎంపిక చేయడం, పరీక్షా కేంద్రాలను గుర్తించడం కూడా ఎన్టీఏ బాధ్యత. ఇవే కాకుండా పరీక్ష సిలబస్, మాక్ టెస్ట్, నమూనా పేపర్ మొదలైనవి జారీ చేయడం కూడా ఎన్టీఏ విధులలో ఒకటి. ఎన్టీఏ పరీక్షలు, దరఖాస్తు ఫారమ్‌ల అధికారిక నోటిఫికేషన్‌ను కూడా జారీ చేస్తుంది.
ఏ పరీక్షలు నిర్వహిస్తారు?
ఎన్టీఏ తన ఆధ్వర్యంలో CUET UG, CUET PG, UGC-NET, JEE, CMAT, JNUET, IIFT ప్రవేశ పరీక్ష, జాయింట్ CSIR-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష, ICAR ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్, హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్, IGNOU PhD & OPENMAT (MBA) ప్రవేశ పరీక్ష, జాయింట్ CSIR- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, టీచింగ్‌లో వార్షిక రిఫ్రెషర్ ప్రోగ్రామ్ వంటి పరీక్షలను నిర్వహిస్తుంది.
ఎన్టీఏ అధినేత ఎవరు?
ప్రస్తుతం ప్రదీప్ కుమార్ జోషి ఎన్టీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇంతకు ముందు యూపీఎస్సీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇది కాకుండా ఆయన ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ పదవిని కూడా నిర్వహించారు. ఆయన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (NIEPA) డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆయన 28 సంవత్సరాల కంటే ఎక్కువ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ అనుభవం కలిగి ఉన్నారు. ఆయను ఆర్థిక నిర్వహణలో నైపుణ్యం ఉంది.
NTA లో ఉద్యోగం ఎలా పొందాలి
అవసరాన్ని బట్టి ఎన్టీఏలోని వివిధ పోస్టులపై ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ నియామకాలకు సంబంధించిన సమాచారం NTA అధికారిక వెబ్సైట్ ntarecruitment.ntaonline.inలో అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
AP Localbody Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. SEC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!