Farmer Hulchul: జనగామ కలెక్టర్ కార్యాలయం పైకెక్కి పురుగుల మందు తాగి ఓ రైతు హల్ చల్ చేశాడు. జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నర్సయ్య అనే రైతు చాలా కాలంగా అధికారులు తన 4 ఎకరాల భూ వివాదం పరిష్కరించకపోవడంపై విసుగు చెందాడు. పరిష్కారం కోసం చెప్పులరిగేలా కార్యాలయం చుట్టూ తిరిగి నర్సయ్య విసుగుచెందాడు. మనస్తాపం చెందిన ఆ రైతు జనగామ కలెక్టర్ కర్యాలయం మీదికి ఎక్కి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సంఘటన స్థాలానికి చేరుకొని రైతుని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. వైద్యులు అతనికి చికిత్స చేసి రక్షించారు. గతంలో కూడా రెండుసార్లు కలెక్టరేట్‌లో బాధితుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని మంత్రి సీతక్క, అధికారులను సదరు రైతు కోరారు. తనకు న్యాయం చేయకపోతే బతకనని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Read Also: Kodanda Reddy: ఇది చారిత్రక నిర్ణయం.. మాటకు కట్టుబడి సీఎం రుణమాఫీ చేస్తున్నారు..