తెలంగాణలో ఓటు షేర్ పెంచుకున్నామని, సుస్థిర పాలన అందిస్తున్నామని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్‌పై చర్చ జరుగుతుంది కానీ ముందుకు కదలడం లేదన్నారు.
హైదరాబాద్‌లో రాత్రి సమయంలో ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉండదని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాత్రి 10.30 దాటితే నో ఫ్రెండ్లీ పోలీస్.. ఓన్లీ లాఠీ ఛార్జ్ పోలీస్ అని పోలీసులు ప్రకటిస్తున్నారు. రాత్రి 10:30 గంటలకు వ్యాపార సముదాయాలు మూసివేయాలని ఆదేశించారు.
కేవలం రూ.9వేల రూపాయలకోసం బావ బావమరిదిల మధ్య తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది. ఇరువురి తరపున వర్గీయులు పరస్పర దాడులకు పూనుకున్నారు. ఈ ఘటనలో ఒకరు హత్యకు గురికాగా, మరో ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు.
తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగియడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టారు. ఐఏఎస్ ఆఫీసర్ కాట ఆమ్రపాలి తెలంగాణ ప్రభుత్వంలో సీనియర్ అధికారుల కన్నా పవర్‌ఫుల్‌గా మారారు. తాజాగా చేపట్టిన బదిలీల్లో ఆమ్రపాలిని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించారు.
ఈ నెల 28న వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరంగల్ నగరం అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టి సారించనున్నారు. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ఈనెల 28న హనుమకొండ కలెక్టరేట్‌లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
జూడాలతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. ఈ క్రమంలోనే సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జూడా వెల్లడించారు. ఇంకా చాలా అంశాలపై క్లారిటీ రాలేదని జూడాలు అంటున్నారు.
ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్, మేఘా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసుకున్నారు.
వస్తు సేవల పన్ను(జీఎస్టీ) 17 స్థానిక పన్నులు, 13 రకాల సెస్‌లను కేవలం ఐదు భాగాలుగా విభజించడం ద్వారా మొత్తం పన్ను వ్యవస్థను చాలా సులభతరం చేసింది. జూలై 1, 2017 నుంచి జీఎస్టీ అమలు చేయబడింది. గత 6 సంవత్సరాలలో సామాన్య ప్రజలు ఉపయోగించే కొన్ని ఉత్పత్తులు, సేవలపై పన్నులు తగ్గించబడ్డాయి.