లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జనతాదళ్-సెక్యులర్ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్‌ను కర్ణాటకలోని బెంగళూరులోని ప్రత్యేక ప్రజాప్రతినిధి కోర్టు బుధవారం తిరస్కరించింది. ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్‌డి రేవణ్ణపై కర్ణాటకలోని హోలెనరసిపురా పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
హైదరాబాద్ లోక్ సభ ఎంపీ, ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ హౌస్‌లో పాలస్తీనాకు మద్దతుగా నినాదాలు చేయడం వివాదానికి దారితీసింది. ఒవైసీపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సీనియర్ న్యాయవాది హరిశంకర్ జైన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒవైసీకి వ్యతిరేకంగా లేఖ రాశారు.
కడప జిల్లా బద్వేల్‌లో సత్య ఏజెన్సీస్ 23వ షోరూంను ఘనంగా ప్రారంభించారు. భవన యజమాని బి.జయ సుబ్బారెడ్డి రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు. ఆయనతో పాటు సత్య ఏజెన్సీ ఏపీ హెడ్ సెంథిల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
హైదరాబాద్ గొప్ప చరిత్రతో పాటు సంస్కృతికి ప్రసిద్ధి చెందిన నగరం. ఈ నగరం వ్యాపారులను ఆకర్షిస్తూ మహానగరంగా వేగంగా రూపాంతరం చెందుతోంది. ఈ మహానగరంలో ప్రణవ గ్రూప్ అద్భుతమైన నివాస, వాణిజ్య ప్రాజెక్టులను రూపొందిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ సంస్థగా ఉద్భవించింది.
బీఆర్‌ఎస్ పార్టీ బీఫాంపై గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం, శ్రీనివాస రెడ్డి, సంజయ్‌కుమార్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఇద్దరి సభ్యతం రద్దు కావాల్సి ఉందన్నారు.
నీట్ అవకతవకలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నీట్ వ్యవహారం పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని ఆయన విమర్శలు గుప్పించారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో 2011లో రైల్‌రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని కేసీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
కీలకమైన, తక్కువగా లభించే ఖనిజాల వెలికితీతలో అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని.. అందుకే ఈ రంగంలో విడతలవారిగా సంస్కరణలు తీసుకొస్తూ.. దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. 2015లో కొత్తగా తీసుకొచ్చిన చట్టం ద్వారా.. సానుకూల మార్పులు కనబడుతున్నాయని ఆయన వెల్లడించారు.