నూతనంగా ఎన్నికైన నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ పదవి ప్రమాణ స్వీకారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజుల్లో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. రెండు లక్షల రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామని తెలిపారు.
థాయిలాండ్ చాలా అందమైన ప్రదేశం. చాలా మంది ఇక్కడకు వెళ్లి ఎంజాయ్ చేయాలని కలలు కంటుంటారు. చాలా మంది బడ్జెట్ కారణంగా థాయ్‌లాండ్ వెళ్లాలంటే భయపడుతారు. ఇప్పుడు ఆ కల నెరవేరే అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు థాయ్‌లాండ్ పర్యటనను ప్లాన్ చేసుకోవచ్చు. కేవలం రూ.50 వేలలోనే థాయ్‌లాండ్‌లో పర్యటించి తిరిగి రావచ్చు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా సాగేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆధార్ కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే దీన్ని మరింత సులభతరం చేసేందుకు ఆర్టీసీ మరో ఆలోచన చేస్తోంది.
సాధారణంగా తన భర్త తనను మోసం చేసి మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడనే ఫిర్యాదులు ఎన్నో చూశాం. ప్రియురాలి మోజులో మోసం చేశాడనే ఫిర్యాదులు కూడా చూశాం. కానీ రెండు సార్లు పెళ్లయిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు దగ్గరుండి వివాహం జరిపించారు. శుభలేఖలు అచ్చువేయించి ఊరందరికీ విందు భోజనాలు పెట్టి భర్తకు మరో వివాహం చేశారు ఇద్దరు భార్యలు. ఈ విచిత్రమైన ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు నేడు తెరచుకోనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నేడు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను నేడు ఎత్తనున్నారు. బాబ్లీ ప్రాజెక్టును తెలంగాణ -మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారులు, కేంద్ర జల సంఘం ప్రతినిధులు సందర్శించనున్నారు.
తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రసారమాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిన్న(ఆదివారం) ఉదయం సర్వీస్ రివాల్వర్‌ను ఇంటి వద్ద వదిలేసి అశ్వరావుపేట నుంచి మహబూబాబాద్‌కు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మీద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు పల్టీలు కొట్టడంతో గణేష్ అనే ఓ యువకుడు మృతి చెందాడు. పిల్లర్ నెంబర్ 296 వద్ద డివైడర్‌ను ఢీకొట్టి మహీంద్రా థార్ జీప్ పల్టీలు కొట్టింది.