Road Accident: ఎక్స్‌ప్రెస్ వే మీద వేగంగా దూసుకొచ్చి పల్టీలు కొట్టిన కారు.. యువకుడు మృతి
- పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మీద రోడ్డు ప్రమాదం
- వేగంగా దూసుకొచ్చి పల్టీలు కొట్టిన కారు
- ఓ యువకుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మీద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు పల్టీలు కొట్టడంతో గణేష్ అనే ఓ యువకుడు మృతి చెందాడు. పిల్లర్ నెంబర్ 296 వద్ద డివైడర్‌ను ఢీకొట్టి మహీంద్రా థార్ జీప్ పల్టీలు కొట్టింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగిది. పల్టీలు కొట్టి కారు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కారు నుజ్జునుజ్జయింది. ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మితిమీరిన వేగమా? మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Shatrughan Sinha: కూతురు పెళ్లైన వారానికే ఆసుపత్రి పాలైన స్టార్ హీరో!
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
పీవీఎన్‌ఆర్ హైవేపై తెల్లవారు 4 గంటలకు రోడ్డు ప్రమాదంపై మాకు సమాచారం అందిందని పీవీఎన్‌ఆర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ ఇంచార్జి శ్రీనివాస్ తెలిపారు. వెంటనే మా టీమ్స్ ఘటన స్థలానికి వచ్చామన్నారు. పీవీఎన్‌ఆర్ హైవేపై ఆరాంఘర్ చౌరస్తా మలుపు వద్ద పిల్లర్ నంబర్ 296 డివైడర్ ఢీకొట్టి థార్ జీప్ పల్టీలు కొట్టిందని వెల్లడించారు. క్రేన్ సహాయంతో రోడ్డుకి అడ్డంగా ఉన్న థార్ కారును తొలగించారు. గణేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రమాదం సమయంలో కారులో మొత్తం నలుగురు ఉన్నట్లు తెలుస్తోందని ఆయన వెల్లడించారు. పీవీఎన్‌ఆర్ హైవేపై స్పీడ్ కంట్రోల్ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు