హత్రాస్ తొక్కిసలాటలో బాధితులందరి మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ గురువారం వెల్లడించారు. మంగళవారం హత్రాస్‌లో బోధకుడు నారాయణ్ సకార్ హరి లేదా భోలే బాబా నిర్వహించిన సత్సంగం తర్వాత జరిగిన తొక్కిసలాటలో మొత్తం 123 మంది మరణించారు.
హత్రాస్‌లో సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం తెలిపారు. వీరంతా సత్సంగాన్ని నిర్వహించే ఆర్గనైజింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్‌లో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 123 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల్లో అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన అధికారులు భోలే బాబా ఆశ్రమంలో నిర్వహించారు. ఈ తనిఖీల్లో భోలే బాబా ఆశ్రమం 13 ఎకరాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆశ్రమం ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించేలా ఉన్నట్లు తెలిసింది.
గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 100కు పైగా రోడ్లు మూసుకుపోయాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించబడింది. ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి.
హత్రాస్ తొక్కిసలాట ఘటనను హిందూ-ముస్లిం సమస్యగా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందని, ముఖ్యమంత్రి ఉద్దేశం తప్పు అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరి పేర్కొన్నారు. మంగళవారం హత్రాస్‌లో సత్సంగం (మత సమ్మేళనం) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానమిచ్చారు. తన ప్రసంగంలో, ప్రధాని, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటూ, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, రైతుల రుణమాఫీ, మహిళా సాధికారత గురించి కూడా ప్రస్తావించారు.
ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి టెలికామ్ దిగ్గజ టెలికామ్ కంపెనీలు మొబైల్ రీచార్జ్ ధరలను భారీగా పెంచాయి. ఇటీవల జియో.. జులై 3 నుండి తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల కోసం ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తర్వాతి రోజునే ఎయిర్ టెల్ కూడా తమ ప్లాన్‌లను పెంచుతున్నట్లు వెల్లడించింది.
మారిపోయిన ఖైదీలను కేవలం జైలు నుంచి వదిలేయడమే కాకుండా వారికి ఉపాధి ఏర్పాటు చేసి బయటకు పంపించాలని అధికారులు నిర్ణయించారు. క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలకు నేడు చర్లపల్లి సెంట్రల్ జైలులో జాబ్ మేళా నిర్వహించనున్నారు.
గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 10 రోజుల క్రితం పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా.. ఐదు రోజుల కిందట మళ్లీ పెరుగుదల కనిపించింది. మంగళవారం పెరిగిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి.