Sabitha Indra Reddy: ఆ వార్తలు అవాస్తవం.. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తా..
- పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం
- సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabitha Indra Reddy: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఇప్పటికే ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా.. మరికొంత మంది కీలక గులాబీ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరో పది మంది ఎమ్మెల్యేలు కూడా రేపోమాపో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే.. మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం నడుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.
Read Also: Parliament: నేటి నుంచి పార్లమెంట్ సెషన్స్ తిరిగి ప్రారంభం.. నీట్, ఈడీలపై చర్చకు విపక్షాల పట్టు..
Also Read
తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రసారమాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ పార్టీలో తనకు కేసీఆర్ సముచితమైన స్థానం కల్పించారని, పార్టీ మారాల్సిన అవసరం కానీ ఆలోచన కానీ ఏ మాత్రం లేదని ఆమె స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీలోనే, కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. సొంత గూటికి చేరుకునేందుకు.. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వంతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని.. ఆషాడ మాసం ప్రారంభంలోనే ఆమె తన కుమారునితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు జోరుగా వార్తలు చక్కర్లు కొడుతుండడంతో ఈ మేరకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.
— Sabitha Reddy (@BrsSabithaIndra) June 30, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!