నీట్ పరీక్షను రద్దు చేయాలని టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ కేంద్రాన్ని కోరారు. విద్యార్థులకు ఉపకార వేతనాల ప్రదానోత్సవం రెండో దశ కార్యక్రమంలో తమిళనాడు వెట్రి కజగం అధ్యక్షుడు, నటుడు విజయ్ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా మాట్లాడారు. నీట్ పరీక్ష రద్దుకోసం తమిళనాడు స్టాలిన్ సర్కారు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మద్దతు ఇస్తున్నానని ఆయన ప్రకటించారు.
వరుస హిట్‌లతో దూసుకుపోతున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మొదటి సారి ఓ అమ్మాయి గెటప్‌లో కనిపించనున్నాడు. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్.. త్వరలో 'లైలా' అనే చిత్రంలో అమ్మాయి గెటప్‌లో అదరగొట్టనున్నట్టు తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ 'లైలా' సినిమా చేస్తున్నాడు.
తమిళ పరిశ్రమలో హాస్య పాత్రలకు పేరుగాంచిన, కొన్ని డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సూరి 'గరుడన్'తో అద్భుతమైన బ్లాక్‌బస్టర్‌ను అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది. 2024లో కోలీవుడ్‌లో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది.
మృణాల్ ఠాకూర్ ఇప్పుడు బాలీవుడ్ చిత్రం సన్ ఆఫ్ సర్దార్ 2లో హీరోయిన్‌గా ఎంపికైంది. సన్ ఆఫ్ సర్దార్‌లో హీరోగా అజయ్ దేవగన్ నటించగా.. ప్రతినాయకుడిగా ప్రతినాయకుడిగా సంజయ్ దత్ నటించారు. వారు ఈ సీక్వెల్‌లో కూడా కనిపిస్తారు. అయితే సన్ ఆఫ్ సర్దార్‌లో హీరోయిన్‌గా సోనాక్షి సిన్హా నటించిన సంగతి తెలిసిందే. కానీ సన్ ఆఫ్ సర్దార్ 2లో ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ నటించనున్నారు.
ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం ప్రస్తుతం ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒకదాని తర్వాత ఒకటి రికార్డులు సృష్టిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్‌తో సహా తారల నటనను ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ సినిమా విజయంతో ఇతర నిర్మాతల మదిలో భయం నెలకొంది.
కజకిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీనికి హాజరవుతారు. ఇక్కడకు వచ్చే ప్రపంచ నాయకులను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కలవనున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ జిల్లాలోని రతీఖాన్‌పూర్‌లో మంగళవారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదాంతమైంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి దాదాపు 100 మందికి పైగా భక్తులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. భోలే బాబాగా ప్రసిద్ధి చెందిన నారాయణ్ సాకార్ హరి సత్సంగంలో పెద్ద సంఖ్యలో భక్తులు అధికంగా పాల్గొనడంతో తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
మతమార్పిడి ఇలాగే కొనసాగితే దేశంలోని మెజారిటీ జనాభా మైనారిటీలుగా మారతారని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఉత్తరప్రదేశ్ అంతటా ఎస్సీ/ఎస్టీ, ఆర్థికంగా పేదవారిని క్రైస్తవ మతంలోకి అక్రమంగా మార్చడం పెద్ద ఎత్తున జరుగుతోందని కోర్టు పేర్కొంది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు మొత్తం 14 గేట్లను సోమవారం తెరిచారు. గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు నుంచి మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల సమక్షంలో నీటిని విడుదల చేశారు.