Marriage: భర్తకు దగ్గరుండి మరీ మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు
- భర్తకు మూడో వివాహం చేసిన ఇద్దరు భార్యలు
- అల్లూరి జిల్లాలో జరిగిన వివాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage: సాధారణంగా తన భర్త తనను మోసం చేసి మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడనే ఫిర్యాదులు ఎన్నో చూశాం. ప్రియురాలి మోజులో మోసం చేశాడనే ఫిర్యాదులు కూడా చూశాం. కానీ రెండు సార్లు పెళ్లయిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు దగ్గరుండి వివాహం జరిపించారు. శుభలేఖలు అచ్చువేయించి ఊరందరికీ విందు భోజనాలు పెట్టి భర్తకు మరో వివాహం చేశారు ఇద్దరు భార్యలు. ఈ విచిత్రమైన ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్లూరి జిల్లా పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరు గ్రామానికి పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో తొలి వివాహం జరిగింది. అయితే పిల్లలు పుట్టలేదని అతను అప్పలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి 2007లో ఓ బాబు పుట్టగా.. అలా వారి జీవనం సాగుతుండగా, తనకు రెండో సంతానం కావాలని పండన్న కోరగా అతనికి ఇద్దరు భార్యలు మూడో పెళ్లి చేయాలని భావించారు.
Read Also: CM Chandrababu: మహిళలపై అత్యాచారాలు చేసే వాళ్లకు అదే చివరి రోజు.. సీఎం వార్నింగ్
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఈ నేపథ్యంలో జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బందవీధికి చెందిన లక్ష్మిని తాను ఇష్టపడ్డ విషయం తన ఇద్దరు భార్యలకు చెప్పాడు పండన్న. ఈ క్రమంలో వారిద్దరే స్వయంగా వధువు ఇంటికి వెళ్లి పెళ్లి గురించి దీంతో వారే స్వయంగా వధువు ఇంటికి వెళ్లి మాట్లాడారు. పెద్దలు కూడా అంగీకారం తెలపడంతో లక్ష్మిని పండన్నకు ఇచ్చి పెద్దలు కూడా అంగీకరించడంతో లక్ష్మిని పండన్నకు ఇచ్చి వివాహం జరిపించేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు భార్యలు ముందుండి వివాహం జరిపించారు. తల్లిదండ్రులు లేని పండన్నకు ఇద్దరు భార్యలే పెళ్లి పెద్దలుగా దగ్గరుండి వివాహం జరిపించారు. శుభలేఖల్లో కూడా వారి పేర్లే వేసి అందరినీ ఆహ్వానింంచారు. గత నెల 25న జరిగిన మూడో పెళ్లికి భార్యలే పెద్దలుగా వ్యవహరించి, పెళ్లి కార్డులు ప్రింట్ చేయించి, బ్యానర్లు వేయించారు. సంతానం కోసం తన భార్యలు త్యాగం చేశారంటూ పండన్న తెలిపాడు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?