కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నుంచి వరద వచ్చి చేరుతోంది. బ్యారేజీకి 14,500 క్యూసెక్కుల మేర వరద రాగా.. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచన మేరకు అన్ని గేట్లను ఎత్తి ఉంచారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన నాగర్ కర్నూల్ మండలం వనపట్లలో జరిగింది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపట్నుంచి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో తొలిసారి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛను పెంపు తొలి నెల నుంచే అమలు చేస్తోంది. రేపు(జులై 1న) రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరగనుంది.
అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘విడాముయర్చి’. ఈ క్రేజీ కాంబోలో సినిమా అనగానే అభిమానులు సహా అందరిలో సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. అసలు సినిమాలో అజిత్ లుక్ ఎలా ఉంటుంది.. మూవీ ఎలా ఆకట్టుకోనుందంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు. ఆ సమయం వచ్చేసింది.. అందరి అంచనాలను మించేలా ‘విడాముయర్చి’ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
అరకు కాఫీపై ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అరకు కాఫీ బాగుంటుందంటూ ప్రధాని ట్వీట్ చేశారు. గిరిజనుల సాధికారత అరకు కాఫీతో ముడిపడి ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. 2016లో సీఎం చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నాటి ఫొటోలను ప్రధాని మోడీ ట్వీట్ చేశారు
17 ఏళ్ల తర్వాత టీ-20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత జట్టుకు రూ.125 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. బోర్డు కార్యదర్శి జై షా జూన్ 30న ఈ విషయాన్ని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు(జూన్ 1) ఏపీ టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి.. జులై 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానుండడంతో మరోసారి టెట్ నిర్వహించాలని ప్రభుత్వానికి వినతులు అందాయి.
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నెం.256ను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది.
విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సందడి ప్రారంభమైంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, విశాఖ ఎంపీ భరత్ హాజరయ్యారు.