ఇరాన్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందడంతో శుక్రవారం ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ అతివాద నేత సయీద్ జలీలీ, సంస్కరణవాది మసౌద్ పెజెష్కియాన్ మధ్య నెలకొంది.
ఆరోగ్యమే మహాభాగ్యం.. అని అంటుంటాం. అలాంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఉదయం దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత ఈ ఒక్క పని చేస్తే చాలు.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండొచ్చు. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి ఉదయాన్నే నడకతో ప్రారంభించాలి.
సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో కోటి విలువైన బంగారంతో పట్టుకున్నట్లు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ శుక్రవారం తెలిపింది. తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు గ్రీన్ ఛానల్‌ను దాటడానికి ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని అడ్డగించారు. అతని మోకాలి వద్ద పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని దాచిపెట్టినట్లు గుర్తించి దానిని స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవలి కాలంలో యువత ప్రేమ అంటూ లేని చిక్కులు తెచ్చుకుంటున్నారు. పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కూతురు ప్రేమించిన వ్యక్తి తమ కులానికి చెందిన వ్యక్తి కాదని కన్న తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. సమాజంలో పరువు ఎక్కడపోతుందో అని భావించిన తల్లిదండ్రులు ప్రాణాలు కూడా తీసేందుకు వెనకాడటం లేదు. ఈ క్రమంలో ఓ సంచలన ఘటన వెలుగు చూసింది.
PM Modi: ఈ ఏడాది అక్టోబర్‌లో షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) సమావేశానికి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి గ్రూప్ దేశాల ప్రభుత్వాధినేతలందరినీ ఆహ్వానించారు. ఈ గ్రూప్‌లో భారత్ కూడా భాగం. అదే సమయంలో, పాకిస్తాన్, భారత్ మధ్య సంబంధాల గురించి ప్రపంచానికి తెలుసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్‌సీఓలో పాల్గొనేందుకు పాకిస్థాన్‌కు వెళతారా అనేది అతిపెద్ద ప్రశ్న. పాకిస్థాన్ విషయంలో మోడీ ప్రభుత్వ విధానం చాలా స్పష్టంగా ఉంది. పాక్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నంత కాలం […]
యూకే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ ఘోర పరాజయాన్ని చవిచూశారు. లేబర్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందింది. ఈ క్రమంలో లేబర్ పార్టీకి చెందిన కీర్ స్టామర్ బ్రిటన్ తదుపరి ప్రధాని అవుతారు. శుక్రవారం జరిగిన జాతీయ ఎన్నికల్లో రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. 650 సీట్లు ఉన్న యూకే పార్లమెంట్‌లో లేబర్ పార్టీ 400 సీట్లకు పైగా గెలుచుకుంది.
యూకే ప్రధాని రిషి సునాక్ దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ పార్టీ 300 సీట్లకు పైగా గెలుచుకున్నట్లు ట్రెండ్‌లు చూపించగా.. సునాక్ కన్జర్వేటివ్ పార్టీ 61 స్థానాల్లో ముందంజలో ఉంది.
గోళ అద్భుతాలను చూసేందుకు అందరూ ఇష్టపడతారు. కానీ గ్రహశకలాలు భూమి దగ్గరగా వెళ్లినా, పేలినా అది సృష్టించే వినాశనం ఊహకు అందదు. అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహశకలం ఒకటి మన భూమి వైపు దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. తాజాగా అఫోసిస్ అనే గ్రహశకలం ఉనికిని గుర్తించినట్లు తెలిపారు. దీని పరిమాణం 370 మీటర్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ముఖం మీద మొటిమలు, మచ్చలు ఏర్పడితే ఎవరికి ఇష్టం ఉంటుంది. కానీ చాలా మంది ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు మొటిమల కారణంగా ఆత్మవిశ్వాసం కోల్పోవాల్సి వస్తుంది. ముఖంపై మొటిమలు రావడం సహజమే అయినా వీటి వల్ల ముఖ సౌందర్యం పాడవుతుంది.
కరోనా మహమ్మారి కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి వారిలో మొహబ్బత్ దీప్ సింగ్ చీమా కూడా ఒకరు. ఉద్యోగం పోవడంతో దీప్ సింగ్ చీమా(36) తన భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి తన సొంత రాష్ట్రం పంజాబ్‌కు తిరిగి వచ్చాడు. ధిల్వాన్‌లో తన సొంత ఫుడ్ ట్రక్ 'ది పిజ్జా ఫ్యాక్టరీ'ని స్థాపించడానికి ఇదే మొదటి అడుగు అని కూడా అతనికి తెలియదు.