టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేశారు. మీడియా ముందుకు వచ్చ లావణ్య మాట్లాడారు. తనను పెళ్లి చేసుకుని.. 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉండి.. నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని.. అందుకు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కారణమని ఆమె ఆరోపించారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి దాదాపు 15 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు.
ఈ దొంగ మామూలోడు కాదండోయ్.. గుజరాత్ పోలీసులు ఇటీవల అనేక రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడిన ఓ దొంగను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత నెలలో రోహిత్ కానుభాయ్ సోలంకి వాపిలో లక్ష రూపాయల చోరీ కేసులో పోలీసుల వలకు చిక్కాడు.
భారీ వర్షాల కారణంగా ముందుజాగ్రత్త చర్యగా రెండు మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా శనివారం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గత రాత్రి నుంచి బల్తాల్, పహల్గాం మార్గాల్లో అడపాదడపా భారీ వర్షాలు కురుస్తున్నాయని వారు వెల్లడించారు.
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై పార్టీ జాతీయాధ్యక్షురాలు మాయావతి స్పందించారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.ఆర్మ్‌స్ట్రాంగ్‌ను నరికి చంపిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాయావతి తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.
దేశంలో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధరలు పెరగడంతో కొనుగోలుదారులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం నేటికీ కొనసాగుతోంది. ఈ యుద్ధం ముగింపు దశకు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గాజాలో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో హమాస్ యూఎస్ ప్రతిపాదించిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు అంగీకరించిందని శనివారం వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.
రోజుకో మలుపుతో, వాదోపవాదనలతో సినిమా రేంజ్ ట్విస్ట్‌లతో సాగుతోంది రాజ్‌తరుణ్ - లావణ్యల వ్యవహారం. తనను రాజ్‌తరుణ్ మోసం చేసాడని, పెళ్లి చేసుకోమని అడిగినందుకు చంపుతానని బెదిరిస్తున్నాడని, మాన్వి మల్హోత్రా అనే హీరోయిన్‌తో రాజ్‌తరుణ్‌కు సంబంధం ఉందని, తనను కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించాడని నిన్న రాజ్ తరుణ్‌పై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య.
పశ్చిమ ఆఫ్రికా దేశమైన మౌరిటానియా తీరంలో పడవ బోల్తా పడటంతో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. వలసదారులు యూరప్‌కు వెళ్లేందుకు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. నైరుతి మౌరిటానియాలోని ఎన్‌డియాగోకు నాలుగు కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ తీరంలో పడవ బోల్తా పడింది.
బ్రిటన్‌లో 2024 ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ, జీవన వ్యయ సంక్షోభం, ప్రజా సేవల కొరత, అక్రమ వలసలతో బ్రిటన్ పోరాడుతోంది. ఇదిలా ఉంటే లేబర్ పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం.. పార్టీ భుజాలపై బాధ్యతల భారాన్ని పెంచింది. బ్రిటన్ ప్రజలు లేబర్ పార్టీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.