MLA Kunamneni : కేటీఆర్ ఫోన్ చేసి సీపీఐకు బేషరతుగా మద్దతు ఇస్తామన్నారు
- కొత్తగూడెం మేయర్ పీఠంపై ఉత్కంఠ భరిత పోరు
- కేటీఆర్ ఫోన్ కాల్‌తో సీపీఐకి బేషరతు మద్దతు
- మేయర్ పదవిని వదులుకునే ప్రసక్తే లేదన్న కూనంనేని
- ఇండిపెండెంట్ల మద్దతుతో తుది వ్యూహాలపై పార్టీ చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kunamneni Sambasiva Rao : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీపీఐకి మద్దతు ప్రకటించడం రాజకీయంగా పెను సంచలనంగా మారింది.
కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ అత్యధిక స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో, ఆ పార్టీకి తాము బేషరతుగా మద్దతు ఇస్తామని కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి తెలిపారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. “మీరు గెలిచారు కాబట్టి మీకు మద్దతు ఇస్తామని కేటీఆర్ గారు చెప్పారు” అని కూనంనేని ధృవీకరించారు. ఈ పరిణామంతో కొత్తగూడెం మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంలో సీపీఐకి లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది.
Also Read
అదిరింది.. 36 వేలకే 5 Star 1.5 Ton AC.. Summer రాకముందే అదిరిపోయే Gift..!
మేయర్ పదవిని ఎట్టి పరిస్థితుల్లోనూ త్యాగం చేసే ప్రసక్తే లేదని కూనంనేని స్పష్టం చేశారు. తమకు దక్కిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని, ఎవరైనా మద్దతు ఇస్తామంటే కాదనబోమని ఆయన పేర్కొన్నారు. మూర్ఖత్వంగా ఎవరి మద్దతును వదులుకోలేమని, మేయర్ పీఠాన్ని దక్కించుకుని ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు.
బీఆర్ఎస్‌తో పాటు పలువురు ఇండిపెండెంట్లు (స్వతంత్ర అభ్యర్థులు) కూడా తమకు సహకరిస్తామని ముందుకు వచ్చారని కూనంనేని తెలిపారు. అయితే, ఎవరి మద్దతు తీసుకోవాలి? పొత్తుల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశంపై మరో రెండు రోజుల్లో పార్టీ అంతర్గత సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
MP News: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఇస్లాంలోకి మారాలని బ్లాక్‌మెయిల్..
తాజావార్తలు
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
ట్రెండింగ్
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!