రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో బుధవారం ఆస్తానాలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న తమ పౌరులపై భారత్ ఆందోళనలను లేవనెత్తారు. వారు సురక్షితంగా తిరిగి రావాలని ఒత్తిడి చేశారు . యుద్ధం నేపథ్యంలో భారతీయుల సమస్యపై లావ్‌రోవ్‌తో లేవనెత్తారా అనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు.
విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి ఇచ్చారు. చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని చెప్పారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్‌కు కూడా నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు.
కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో నుంచి సరికొత్త రెనో 5జీ మోడల్ వస్తోంది. ఒప్పో రెనో 12 5జీ సిరీస్ పేరుతో కంపెనీ ఈ నెలలోనే భారత్‌లో ఈ 5జీ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో ఒప్పో రెనో 12 5జీ, ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఉంటాయి.
పాలస్తీనా అనుకూల మద్దతుదారులు గురువారం ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌస్ పైకప్పు పైకి ఎక్కారు. ముదురు దుస్తులు ధరించిన నలుగురు వ్యక్తులు ఆస్ట్రేలియా పార్లమెంటు పైకప్పుపైకి ఎక్కి బ్యానర్‌లు కట్టారు. బ్యానర్లలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు ఉన్నాయి.
కజకిస్థాన్ రాజధాని అస్తానాలో ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్ర మోడీ చాణక్య అని పిలిచే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై మండిపడ్డారు. షాంఘై సహకార సంస్థ(SCO) సమావేశంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సహా పలు దేశాల నేతలు పాల్గొన్నారు.
నీట్ పరీక్షకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో డీఎంకే నేత ఆర్‌ఎస్ భారతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళనాడులో అందరికీ విద్య అందుబాటులోకి తెచ్చింది ద్రవిడ ఉద్యమమేనని భారతి చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. నేడు కుక్కలు కూడా బీఎ పట్టాలు పొందుతున్నాయని వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోడీ జులై 8 నుంచి 10 వరకు రష్యా, ఆస్ట్రియాల్లో అధికారిక పర్యటనకు వెళ్లనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం వెల్లడించింది. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ జులై 8 , జులై 9 తేదీల్లో మాస్కోలో పర్యటించనున్నారు