Rishi Sunak: క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా..
- ఓటమిని అంగీకరించిన రిషి సునాక్
- ఓటమికి తాను బాధ్యత వహిస్తానన్న సునాక్
- యూకేలో లేబర్ పార్టీ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishi Sunak: యూకే ప్రధాని రిషి సునాక్ దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ పార్టీ 300 సీట్లకు పైగా గెలుచుకున్నట్లు ట్రెండ్‌లు చూపించగా.. సునాక్ కన్జర్వేటివ్ పార్టీ 61 స్థానాల్లో ముందంజలో ఉంది. “ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. ఈ సందర్భంగా కీర్ స్టామర్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. దేశంలో అధికారం శాంతియుతంగా, సద్భావనతో చేతులు మారుతుంది. అది మన దేశ భవిష్యత్తు , స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుందని రిచ్‌మండ్ అండ్ నార్తర్న్ అలెర్టన్‌లోని తన మద్దతుదారులను ఉద్దేశించి రిషి సునాక్ అన్నారు. క్షమించండి.. ఓటమికి తాను బాధ్యత వహిస్తానని రిషి సునాక్ పేర్కొన్నారు.
Read Also: Asteroid: భూమికి పొంచి ఉన్న మరో ప్రమాదం.. అదే జరిగితే మానవ జాతి అంతం..!
Also Read
ఎనిమిది మంది కన్జర్వేటివ్ కేబినెట్ మంత్రులు తమ స్థానాలను కోల్పోయినప్పటికీ, సునాక్ ఉత్తర ఇంగ్లాండ్‌లోని రిచ్‌మండ్ అండ్ నార్తర్న్ అలెర్టన్ నియోజకవర్గాల్లో 47.5 శాతం ఓట్లను సాధించారు. రిషి సునక్ తన ముందున్న లిజ్ ట్రస్ కేవలం 45 రోజుల్లో పదవికి రాజీనామా చేసిన తర్వాత 2022లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 14 సంవత్సరాలు పాలించిన తరువాత, కన్జర్వేటివ్ పార్టీ అనేక సమస్యలపై ఎదురుగాలిని ఎదుర్కొంది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించిన అనంతరం ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం గందరగోళంగా మారింది. కొవిడ్ -19 మహమ్మారి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ప్రభుత్వం తప్పుగా నిర్వహించడం వల్ల ఓటర్లు కూడా విసుగు చెందారని అభిప్రాయ సేకరణలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!