Balineni Srinivas Reddy: వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి వెళ్తారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్వయంగా స్పందించారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను జనసేనలోకి వెళ్తున్నానంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని బాలినేని స్పష్టం చేశారు. అదంతా ఒట్టి ఊహాగానాలేనని తేల్చేశారు. అలాగే తాను ఒంగోలులో లేనంటూ ప్రచారం జరుగుతోందన్న బాలినేని.. తాను ఎక్కడికి వెళ్లలేదని, ఒంగోలులోనే ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడితే ప్రజల తరుఫున పోరాటం చేస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిపైనా ఆయన కామెంట్స్ చేశారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తారనే వార్తలపైన బాలినేని స్పందించారు. ప్రకాశం జిల్లా వైసీపీలో నాయకులకు కొదువ లేదన్న బాలినేని.. జిల్లా అధ్యక్ష పదవిని ఇవ్వాలనుకుంటే స్థానిక నేతలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Also: Snake Video: విద్యార్థి స్కూల్ బ్యాగ్‌లో విషపూరిత పాము.. వీడియో వైరల్
ఇటీవలి ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గత 25 ఏళ్లలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు. ఎన్నికలకు ముందు తాను ఇవే నా చివరి ఎన్నికలు అని ముందే చెప్పానని.. ఎవరి ఆలోచన ఏంటో ప్రజలు గెలిపించలేదన్నారు. ఫలితాల అనంతరం మా కార్యకర్తల మీద కేసులు పెట్టడం, దాడులు చేయటం చేశారని.. గతంలో మేము ఇలానే చేస్తే మీ పరిస్థితి ఎలా ఉండేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలు వదిలేద్దామని అనుకున్న సమయంలో కార్యకర్తలపై దాడులు చేసి మళ్లీ రాజకీయం మీరే చేయిస్తున్నారని మండిపడ్డారు. మీరు ఏదైనా చేయాలనుకుంటే డైరెక్ట్‌గా నా మీదే చేయండి.. కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.