ఏపీ అసెంబ్లీలో విధులు నిర్వహిస్తున్న మార్షల్ గుండెపోటుతో మృతి చెందాడు. కె.లూధియారావు అనే మార్షల్‌కు ఉదయం విధుల్లో ఉండగా గుండెపోటు రాగా.. వెంటనే తోటి సిబ్బంది మంగళగిరి ఎన్నారై హాస్పటల్‌కు తరలించారు.
గుంటూరులో 2022న జరిగిన ఓ యువతి కిడ్నాప్ వ్యవహారం, ఆ తర్వాత అనుమానాస్పద మృతి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో నల్లపాడు పోలీసుల తీరుపై, ఓ పక్కన బాధితులు మరో పక్కన ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారు ఎల్లుండి(శుక్రవారం) నుంచి మూడు రోజులపాటు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వివిధ కూరగాయలు, ఆకులు, ఆకు కూరలతో అర్చకులు, అధికారులు అమ్మవారిని అలంకరించనున్నారు.
తమ అనుమతి లేకుండా జీపీఎస్ జీవో, గెజిట్ విడుదలపై ఏపీ సీఎంవో సమాచారం సేకరిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ విషయంపై విచారణ చేపడుతోంది. ఆర్థిక శాఖ, న్యాయ శాఖల్లో పని చేసే వాళ్లల్లో ఎవరు దీనికి కారకులనే దానిపై సీఎంవో ఆరా తీస్తోంది.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కలిశారు. ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి జేపీ నడ్డాతో చర్చ జరిగిందని ఆయన భేటీ అనంతరం మీడియాతో వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల సంసిద్ధత గురించి చర్చించామన్నారు.
విశాఖలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. అనకాపల్లిలోని రాంబిల్లిలో ప్రేమపేరుతో బాలికను చిత్రవధ చేసి హత్య చేసి తానూ బలవన్మరణానికి పాల్పడిన ఘటనను మరువక ముందే.. ఉమ్మడి జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. విశాఖ న్యూపోర్ట్ పరిధిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి కత్తిదూశాడు.
ఏపీ రాజధానికి జాతీయ రహదారికి అనుసంధానం చేసే అంశపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్‌హైవేతో అనుసంధానం చేసేలా సీడ్ యాక్సిస్ రోడ్ తరహాలో మరో రెండు రోడ్ల నిర్మాణానికి సీఆర్డీయే ప్రణాళికలు రచిస్తోంది.
గుంటూరు కార్పొరేషన్‌లో సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చేకూరి కీర్తి, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
నెట్టింట వైరల్‌గా మారిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా చెప్పుల ధర ఎంత ఉంటుంది. వందలల్లో ఉంటుంది. ఇక కాస్తా ధనవంతులైతే వేలల్లో పెట్టి కొంటారు. మరి బాత్రూంకు వాడే చెప్పులైతే వంద రూపాయలు లేదా ఇంకాస్తా ఎక్కువ పెట్టి కొంటారు. కానీ సౌదీ అరేబియాలోని ఒక దుకాణంలో వేలల్లో కాదు లక్షల్లో అమ్ముతున్నారు.