Minister BC Janardhan Reddy: చంద్రబాబు అంటే అభివృద్ధికి అంబాసిడర్ అని.. ఆయన స్పూర్తితో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా.. రోడ్ల మరమ్మతు పనులను తనిఖీ చేసేందుకు వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు మెరుగైన రహదారులు అందించాలనే లక్ష్యంతో రూ.861 కోట్ల నిధులతో రోడ్ల మరమ్మతు పనులు చేపడుతున్నామన్నారు.
Read Also: Margani Bharat: జాతీయ స్థాయి సినీ నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం అక్రమం
ప్రకాశం జిల్లాలో దాదాపు రూ.21 కోట్లతో 1313 కి.మీ రహదారుల మరమ్మతు పనులు చేపట్టామన్నారు. త్వరలో 1300 కి.మీ రహదారులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం రోడ్లను రెన్యువల్ చేయకపోవడంతో నేడు అదనంగా ప్రభుత్వంపై 15 వేల కోట్ల భారం పడిందన్నారు. మోడీ, బాబు, పవన్ త్రయం ఆధ్వర్యంలో రాష్ట్రానికి తిరిగి పూర్వవైభవం వస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.