Botsa Satyanarayana: అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వం తొందరపాటు చర్యగా పరిగణిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ అన్నారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో సుమారు 20 మంది చనిపోయారని.. ఆ ఘటనకు ఎవరిని బాధ్యులుగా చేశారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రైతులకు మద్దతు ధర, గిట్టుబాటు ధర ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని విమర్శించారు. రైతుల పంటకు ఇన్స్యూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం కట్టడం లేదన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఈ రోజు నిరసన చేపట్టామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నీటి సంఘం ఎన్నికలు ప్రజాస్వామికంగా జరగడం లేదని.. పోలీసులను పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారని అన్నారు. నీటి సంఘం ఎన్నికలను వైసీపీ పార్టీ బహిష్కరిస్తోందన్నారు. అవంతి తన అవసరాల కోసం రాజీనామా చేసి ఉంటారని.. అది ఆయన ఇష్టమని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
Read Also: Andhra Pradesh: రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య ఎన్నిక