Digital Health Cards: ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు..
- 2026-27 వార్షిక బడ్జెట్ ప్రకటన..
- వైద్యారోగ్య శాఖకు భారీగా నిధులు కేటాయింపు..
- ఈ ఏడాది చివరి నాటికి టిమ్స్ ఆసుపత్రులు అందుబాటులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకమైన 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవల నాణ్యతను పెంచే లక్ష్యంతో వైద్యారోగ్య శాఖకు రూ.13,679 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈ బడ్జెట్ ప్రసంగంలో మంత్రి భట్టి విక్రమార్క ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లు ఎంతో కాలంగా ఆశిస్తున్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా.. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు, 421 గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చు. దాదాపు 1,998 రకాల వ్యాధులకు ఎటువంటి ముందస్తు చెల్లింపులు లేకుండా (Cashless) వైద్యం అందుతుంది. ప్రతి ఉద్యోగికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక డిజిటల్ హెల్త్ కార్డులను అందజేయనున్నారు.
వైద్య మౌలిక సదుపాయాల విస్తరణ..
Also Read
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు నిర్మిస్తున్న మూడు టిమ్స్ (TIMS) ఆసుపత్రులను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే.. నిమ్స్ ఆసుపత్రి విస్తరణ పనులు, వరంగల్‌లో నిర్మిస్తున్న అత్యధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాలను వేగవంతం చేస్తామన్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 6,582 టెర్షియరీ కేర్ బెడ్లు రోగులకు అందుబాటులోకి వస్తాయి.
వైద్య విద్యారంగంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ.. రాష్ట్రంలో ఇప్పటికే కొత్తగా 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ స్కూల్స్, 28 పారామెడికల్ కళాశాలలను ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు వైద్య వ్యవస్థను పటిష్టం చేయడమే ఈ బడ్జెట్ ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!