Ind vs SA: భారత్‌తో టీ20 సిరీస్‌కు దక్షిణాప్రికా స్టార్ ఆటగాడు దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్‌క్రమ్ భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన అతడు మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఆడడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు చెప్పింది. పాజిటివ్‌గా తేలిన తర్వాత మార్‌క్రమ్ ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడు తిరిగి జట్టుతో చేరి సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. గాయంతో బాధపడుతున్న డికాక్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్రికెట్ దక్షిణాఫ్రికా పేర్కొంది.
ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించింది. అయితే ఇప్పుడు మూడో టీ20లో ఓడిపోవడంతో సిరీస్ కైవసం చేసుకోవడం కష్టతరంగా మారింది. కాగా మార్‌క్రమ్ లేకపోయినా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉంది. ఈ కారణంగానే తొలి టీ20లో ఆతిథ్య జట్టు 211 పరుగులను సులభంగా ఛేదించింది. మార్‌క్రమ్‌కు కొవిడ్ సోకినట్లు తొలి టీ20 మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది . అయితే, జట్టులోని ఇతర సభ్యులెవరూ వైరస్ బారిన పడకపోవడంతో సిరీస్‌పై దాని ప్రభావం కనిపించలేదు. ఇప్పటివరకు ఐసోలేషన్‌లో ఉన్న మార్‌క్రమ్ తాజాగా స్వదేశానికి బయలుదేరి వెళ్లాడు.
Also Read
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్‌కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
- IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్‌కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
- Dean Elgar Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్.. విరాట్ కోహ్లీతో వివాదం గుర్తుందా?
- IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
ఐపీఎల్-2022లో ఐడెన్ మార్‌క్రమ్ భారీగా పరుగులు సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 400కు పైగా పరుగులు సాధించాడు. బ్యాటింగ్‌తో పాటు ఆఫ్ స్పిన్‌తోనూ సత్తా చాటగలడీ స్టార్ ప్లేయర్. దక్షిణాఫ్రికా టీ20 జట్టులో మార్‌క్రమ్ కీలక ఆటగాడు. మొత్తం20 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన అతను 39 సగటు, 147 స్ట్రైక్‌రేట్‌తో 588 పరుగులు చేశాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా కూడా 5 వికెట్లు తీశాడు. ఫామ్‌లో ఉన్న మార్‌క్రమ్ మిగతా రెండు కీలక మ్యాచ్‌లకు లేకపోవడం సఫారీలకు ఎదురుదెబ్బే.
తాజావార్తలు
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!