రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అందరి దృష్టి రష్యా అధ్యక్షుడు పుతిన్ పై పడింది. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని వివిధ కథనాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపైనా రకరకలా ఊహగానాలు వెలువడుతుండడంతో అందరూ ఆయనకు ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నారు. పుతిన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని.. ఎక్కువ రోజులు బతికి ఉండలేరని ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది.
వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని, రక్త క్యాన్సర్‌తో ఆయన ఆరోగ్యం దెబ్బతిందని గత నెలలో వార్తలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా క్రెమ్లిన్‌లో జరిగిన ఓ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పుతిన్ నిలబడడానికి ఇబ్బంది పడుతున్నట్టు ఆ వీడియోలో కనిపించింది. పోడియం వద్ద నిల్చున్న పుతిన్ వణుకుతుండడం కూడా ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆయన అనారోగ్యం బారినపడడం నిజమేనని కొందరు నిర్ధారించేస్తున్నారు.
రష్యాకు చెందిన అత్యంత సంపన్న వ్యక్తి ఒకరు పుతిన్ ఆరోగ్యంపై స్పందిస్తూ.. పుతిన్ రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గత నెలలోనే తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఆయన వెన్నుకు శస్త్రచికిత్స జరిగిందని, ఉక్రెయిన్‌పై యుద్ధ ప్రకటనకు ముందు ఇది చోటు చేసుకుందని పేర్కొన్నారు. మరోవైపు పుతిన్ విదేశాలలో పర్యటించినప్పుడు ఆయన మల, మూత్రాలను సేకరించి స్వదేశానికి తీసుకెళ్తారని నిన్న ఫాక్స్ న్యూస్ నివేదిక వెల్లడించింది. దీనికోసం ఆయన ప్రత్యేకంగా ఓ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారని అందులో పేర్కొంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్స చేయించుకునేందుకు నిరంతరం వైద్యుల సమక్షంలోనే ఉంటున్నారని గతంలో ఓ బ్రిటిష్ గూఢచారి అన్నారు. వైద్యం కోసం ఆయన తరచుగా సమవేశాలకు రాకపోవడం, వచ్చినా మధ్యలో విరామం తీసుకోవడం వంటివి చేస్తారని చెప్పారు. అయితే.. పుతిన్ అనారోగ్యం గురించి కచ్చితమైన వివరాలు ఇంకా తెలియలేదని ఆయన వెల్లడించారు. “పుతిన్ తీవ్ర అనారోగ్యంలో బాధపడుతున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఎంత వరకు ఆయన ఆరోగ్యం క్షీణించింది అనే విషయాలు తెలియరాలేదు. ఆయన అనారోగ్యం రష్యా పాలనపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని” బ్రిటీష్ గూఢచారి వెల్లడించారు.
Putin’s legs shaking, he looks unsteady on his feet, fueling more speculation about his health. Video was taken Sunday. pic.twitter.com/TIVfK30tAp
— Mike Sington (@MikeSington) June 14, 2022