ఇవాళ ఏపీ బడ్జెట్ సమావేశాలను జగన్ సర్కార్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా అసెంబ్లీలో..సిఎం జగన్ మాస్కు లేకుండా దర్శనం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సిఎం జగన్ పై టిడిపి నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఏపీలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయని.. ఇలాంటి సమయంలో సిఎం జగన్ మాస్క్ పెట్టుకోకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోకపోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధరిస్తారు? అంటూ సిఎం జగన్ కు చురకలు అంటించారు […]
ఇండియాలో కరోనా విలయం కొనసాగుతోంది. దేశంలో ప్రతి రోజు 3 లక్షల కేసులు నమోదవు తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 2,57,72,400 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో కరోనా తీవ్రత తగ్గకముందే.. బ్లాక్ ఫంగస్ ప్రజలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మరో వ్యాధి ఇండియాను టెన్షన్ పెడుతోంది. తాజాగా పాట్నాలో వైట్ ఫంగస్ రోగులను వైద్యులు గుర్తించారు. ఇది బ్లాక్ ఫంగస్ కంటే ప్రాణాంతకమని నిపుణులు భావిస్తున్నారు. పాట్నాకు చెందిన నలుగురు వ్యక్తులు […]
టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. చంద్రబాబు బతుకు అంతా.. అన్నీ దొంగ మాటలు, డొల్లతనమేనని పేర్కొన్నారు. ఈ జీవి జీవితమే అంత అని… వినేవాడుంటే- చార్మినార్ కూడా నేనే కట్టా అని చద్రబాబు అంటాడని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. “ఇదీ హైదరాబాద్ లో జెనోమ్ వ్యాలీ తానే పెట్టాను అంటూ పదే పదే డబ్బా కొట్టే ఫేక్ విజనరీ, మీడియా మేడ్ మాన్ చంద్రబాబు బతుకు – అన్నీ దొంగ […]
రైతులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డీఏపీ ఎరువులపై సబ్సిడీ పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎరువుల ధరలపై ప్రధాని నరేంద్రమోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా.. డీఏపీ ఎరువులపై సబ్సిడీ 140% పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. గతంలో డీఏపీ సంచికి రూ. 500గా ఉన్న సబ్సిడీని రూ.1200కు పెంచింది కేంద్రం. ఈ సబ్సిడీ కోసం రూ. 14,775 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయంగా […]
తెలంగాణలో మరింత లాక్ డౌన్ అమలు అవుతోంది. లాక్‌డౌన్ అమలుపై సీపీ, ఐజీ, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు. లాక్‌డౌన్‌పై జిల్లాల వారీగా సీఎం కేసీఆర్ రోజూ సమీక్షిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఒక్కసారిగా నిత్యావసరాల కోసం బయటకు వస్తున్నారన్న డీజీపీ… అందరూ ఒకేసారి రావడం వల్లే మార్కెట్లు, దుకాణాల వద్ద రద్దీ ఏర్పడుతోందని పేర్కొన్నారు. కమిషనర్ నుంచి ఏసీపీ స్థాయి అధికారి వరకు రహదారులపై తిరగాలని డీజీపీ […]
నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 9 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈరోజు జరగబోతున్నాయి. ఒక్కరోజు మాత్రమే ఈ సమావేశం ఉంటుంది. అయితే.. రూ. 2.25 -రూ. 2.30 లక్షల కోట్ల మధ్యలో 2021-22 వార్షిక బడ్జెట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాల అమలుకు పెద్ద పీట వేయనుంది ఏపీ సర్కార్. సామాజిక పెన్షన్ను రూ. 2500కు పెంచనున్న ప్రభుత్వం… […]
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,76,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,57,72,400 కి చేరింది. ఇందులో 2,23,55,440మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 31,29,878 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 3,874 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,87,122 కి చేరింది. […]
తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని సిఎం కెసిఆర్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ. అయితే కెసిఆర్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై బిజేపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఆయుష్మాన్ భారత్ లో చేరాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని… రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలన్న డిమాండ్ తో రేపు […]
టిడిపికి సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. టిడిపికి మాట్లాడటానికి, చెప్పుకోవడానికి ఏమి లేదని.. అందుకే సభకు రామంటున్నారని సజ్జల పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేస్తే టిడిపి గగ్గోలు పెడుతోందని.. రఘురామకృష్ణరాజు ఏడాది నుంచి ప్రభుత్వంపై విద్వేషం ప్రదర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. సిఎం జగన్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని.. రఘురామకృష్ణరాజు అరెస్ట్ రాత్రికి రాత్రే జరిగింది కాదన్నారు. రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు. టిడిపి అడ్డదారుల్లో వైసీపీ సర్కార్ […]