వరంగల్ పర్యటనలో భాగంగా ఇవాళ ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్న సిఎం కెసిఆర్ నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం అని ఆయన అన్నారు. ప్రతీ బెడ్ […]
సిఎం కెసిఆర్ పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్, ఫార్మ్ హౌస్ దాటి సీఎం కేసీఆర్ బయటకు రావాలని బీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుందన్నారు. ప్రజల విజ్ఞప్తులను కూడా తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకే టైం ఇవ్వని సీఎం..ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత బయటక వచ్చారని ఎద్దేవా చేశారు. పబ్లిసిటీ కోసమే ఇదంతా చేశారు…సీఎం కేసీఆర్ గాంధీకి వెళ్లడం పట్ల చాలా సంతోషిస్తున్నామన్నారు. […]
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని..ఎదిగే కొద్ది ఒదగాలి అనేది తన విధానం.. మనమంతా ప్రజలకు సేవకులమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రైతుకు విత్తనం నుంచి పంట అమ్మేవరకు తోడుగా నిలబడుతున్నామని.. ఆర్బీకేల ద్వారా కల్తీ లేని విత్తనాలు, మందులు, ఇన్ పుట్ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు గిట్టుబాటు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని..కుట్రలు చేసి పంచాయతీలపై ఆకుపచ్చ, నీలం రంగులను తుడిచివేయించగలిగారని టిడిపి కి చురకలు అంటించారు. జనం గుండెల్లో ఉన్న […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. మొన్న తగ్గినట్టే తగ్గిన కొత్త కేసులు.. క్రమంగా రెండు రోజుల నుంచి మళ్లీ పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 22,610 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరోసారి వంద మార్క్‌ను క్రాస్ చేసిన మృతుల సంఖ్య.. 114 కు పెరిగింది.. ఇదే సమయంలో 23,098 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,21,142కి చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య […]
ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ తరుణంలో ఏపీ అసెంబ్లీ వేదికగా ఎంపి రఘురామకృష్ణరాజుపై ఎమ్యెల్యే జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు చంద్రబాబు అయితే.. ఉపాధ్యక్షుడు రఘురామ కృష్ణరాజు అని ఆయని ఫైర్ అయ్యారు. వైసీపీ పార్టీ గుర్తు, సిఎం జగన్ ఫోటోతో రఘురామకృష్ణరాజు గెలిచారని గుర్తు చేశారు. ఆయన ఎంపి పదవీకి రాజీనామా […]
కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడుతోన్న భారత్‌ను ఆదుకోవడానికి క్రమంగా కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి.. తోచిన సాయాన్ని చేస్తున్నాయి.. ఇక, ఇప్పటికే గూగుల్, అమెజాన్ ఇండియా లాంటి చాలా సంస్థలు భారీ సాయాన్ని ప్రకటించాయి. ఇందులో భాగంగానే అమెరికా కూడా ఇండియాకు ఆర్థిక సాయం అందిస్తోంది. కరోనా పోరులో ఇప్పటి వరకు ఇండియాకు 500 మిలియన్ డాలర్ల సాయం చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. 80 మిలియన్ల వ్యాక్సిన్లను ఇతర దేశాలకు పంపిణి చేయడంపై త్వరలో నిర్ణయం […]
ఈటలకు మరో షాక్ తగిలింది. జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు, ఎంపీపీ దొడ్డే మమతతో పాటు 12 మంది కౌన్సిలర్లు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సింగిల్విండో చైర్మన్ లు నాయకులు టీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి కెసిఆర్, కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తామని ప్రకటించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించడంతో తెలంగాణను సాధించుకున్నామన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో […]
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటలలో నైరుతి రుతపవనాలు దక్షిణ అండమాన్ సముద్రము, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం మరియు దానిని అనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఎల్లుండి (22వ తేదీన) అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని… ఈ అల్పపీడనం మరింత బలపడి 24వ తేదీకి తుఫానుగా ఏర్పడే అవాశముందని పేర్కొంది. ఇది […]
జూన్ 18-22 మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో ఆడేందుకు భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లనుంది. ఆ తర్వాత అక్కడే ఉండి ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. కానీ ఈ మధ్యలో జులైలో బీసీసీఐ మరో టూర్‌ను ప్లాన్ చేసింది. గతేడాది కరోనా వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జూలై 13, 16, 19 […]