టిడిపికి సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. టిడిపికి మాట్లాడటానికి, చెప్పుకోవడానికి ఏమి లేదని.. అందుకే సభకు రామంటున్నారని సజ్జల పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేస్తే టిడిపి గగ్గోలు పెడుతోందని.. రఘురామకృష్ణరాజు ఏడాది నుంచి ప్రభుత్వంపై విద్వేషం ప్రదర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. సిఎం జగన్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని.. రఘురామకృష్ణరాజు అరెస్ట్ రాత్రికి రాత్రే జరిగింది కాదన్నారు. రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు. టిడిపి అడ్డదారుల్లో వైసీపీ సర్కార్ ను అస్థిరపర్చే కుట్ర చేస్తోందని.. అందులో భాగంగానే రఘురామకృష్ణరాజును టిడిపి వాడుకుందని సజ్జల ఫైర్ అయ్యారు. చట్టానికి లోబడే.. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు.