పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్న హరి హర వీరమల్లు మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ మూవీకి సంబంధించిన అనేక కీలక సన్నివేశాలను హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలోని సెట్స్ వేసి తీస్తున్నారు. దానికి తోడు ఇది పిరియాడికల్ డ్రామా కావడంతో పోర్ట్ సెట్స్ ను గ్రాఫిక్ తో డిజైన్ చేయబోతున్నారు. […]
కరణ్ జోహర్ టైం అస్సలు బాలేదనే చెప్పాలి. చాలా రోజులుగా ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. మరీ ముఖ్యంగా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత కరణ్ జోహర్ విపరీతంగా ట్రోలింగ్ కి గురయ్యాడు. ఇప్పటికీ నెటిజన్స్ కోపం పెద్దగా ఏం తగ్గలేదు. స్టార్ కిడ్స్ ని ఎంకరేజ్ చేస్తూ స్వయంగా ఎదిగిన వార్ని తొక్కేస్తాడని అతనిపై ముద్ర పడిపోయింది. అసలే నెపోటిజమ్ ఆరోపణలు, పైగా కరోనా లాక్ డౌన్ కష్టాలు, నష్టాల్లో ఉన్న కేజోకి ఇప్పుడు […]
యంగ్ హీరో అల్లు శిరీష్ హోమ్ ఐసొలేషన్ సందర్భంగా తన ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టి జిమ్ లో రెగ్యులర్ గా కఠినమైన వర్కౌట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో కండలు తిరిగిన దేహాన్ని సిద్ధం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో పోస్ల్ చేశాడు. ఇతగాడి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. దీని కోసం వర్క్ఔట్స్ చేయడమే కాకుండా పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తున్నాడు అల్లు శిరీష్. ‘గౌరవం’ సినిమాతో హీరోగా […]
మాధురీ దీక్షిత్ అనగానే మనకు ఎన్నో అద్భుతమైన చిత్రాలు గుర్తుకు వస్తాయి. అయితే, ఆమె గొప్ప నటి అనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, అంతకంటే ఎక్కువగా మాధురీ అంటే డ్యాన్స్! ఆమె గ్రేస్ మళ్లీ మరెవరికి లభించేది కాదు. అంతలా తన స్టెప్పులతో నిన్నటి తరాన్ని, నేటి తరాన్ని కూడా ఆకట్టుకుంటోంది సీనియర్ సుందరి! మాధురీ లాంటి మాయాజాలం సంజయ్ లీలా బాన్సాలీతో కలిస్తే? ‘దేవదాస్’ చిత్రంలో మనం ఇప్పటికే ఓ సారి అటువంటి అద్భుతం […]
ఇవాళ సీఎం కేసీఆర్ వరంగల్ లో పర్యటించారు. నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెలిప్యాడ్ వద్ద మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ సీఎంకు స్వాగతం పలుకగా అనంతరం కేసీఆర్ నేరుగా ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అక్కడ ఉన్న కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులను పరామర్శించి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోకి కోవిడ్ వార్డులలో పర్యటించి రోగులకు భరోసా […]
కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై బిజేపి నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడిలో అనేక మంది అధికార పార్టీ నేతలు హస్తం ఉందని..ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోగులను రక్షించడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని విష్ణు వర్ధన్ రెడ్డిమండిపడ్డారు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని..చేతల్లో చర్యలు లేవన్నారు. ప్రయివేటు ఆసుపత్రిలో ఎక్కడైనా 50 శాతం రోగులు చేర్చుకున్నట్లు ఏ ఒక్కరైనా ఆధారాలతో నిరూపించగలరా? రాష్ట్రంలో 514 ప్రయివేటు ఆసుపత్రుల్లో బెడ్లు కేటాయించినట్లు చెబుతున్నారు.. కనీసం 10 […]
బడ్జెట్ నేపథ్యంలో నిన్న ఏపీ అసెంబ్లీ ఒకరోజు సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో బడ్జెట్ తో సహ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. అయితే దీనిపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. సిఎం జగన్ ఒక్కసారి హామీ ఇస్తే.. కచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటాడని విజయసాయిరెడ్డి కొనియాడారు. “హామీ ఇస్తే నిలబెట్టుకోవడం జగన్ గారి సహజ గుణం – సహజ శైలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా […]
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసా గుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు కరోనాతో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. అయితే తాజాగా కరోనాతో ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్ లాల్ బహుగుణ ఇవాళ మృతి చెందారు. కొన్ని […]
తెలంగాణకు మరో 3 రోజులపాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి దిశ నుండి గాలులు లోయర్ ట్రోపోస్పీయర్ వరకు బలంగా వ్యాపించి, దక్షిణ బంగళాఖాతంలో కొంత భాగం, నికోబార్ ద్వీపం, దక్షిణ అండమాన్ సముద్రము మొత్తం, ఉత్తర అండమాన్ సముద్రంలో కొంత భాగాములోకి నైరుతి రుతపవనాలు ఈరోజు ప్రవేశించాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానిని అనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో సుమారుగా 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. […]
ఏపీలో కోవిడ్ విలయం కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని… ఆక్సిజన్ సరఫరా పైపులు, మాస్క్‌లు ఇవన్నీ కూడా నిర్ణీత ప్రమాణాలున్న వాటినే వినియోగించాలని అధికారులకు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు సిఎం జగన్. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని..ప్రతి ఆస్పత్రి నుంచి నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులు, రెమ్‌డెసివర్ బ్లాక్ మార్కెట్ కఠిన […]