తెలంగాణ రాష్ట్రంలో అమల్లో వున్న లాక్ డౌన్ ను ఈనెల 30 తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులందరితో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను సిఎం కెసిఆర్ తెలుసుకున్నారు. క్యాబినెట్ మంత్రులందరి అభిప్రాయాలను సేకరించిన మేరకు సిఎం కెసిఆర్ లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు. […]
మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి పాలసీ 2021-22ను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం ఉన్న 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 700 మెట్రిక్ టన్నులకు పెంచటమే ఉద్దేశ్యంగా ఈ పాలసీని ప్రారంభించారు. రాష్ట్రంలో 50 పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పాలసీ రూపుదిద్దుకుంటోంది. ముందుకు వచ్చే ఆక్సిజన్ ఉత్పత్తిదారులకు పలు ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. పెట్టుబడిలో 30 శాతం వరకు సబ్సిడీ కూడా ఇవ్వనుంది. అలాగే విద్యుత్ యూనిట్ కు […]
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు కరోనాతో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. ఇక ఈ కరోనా మహమ్మారి భారత క్రికెటర్ల ఇళ్ళల్లోనూ విషాదం నింపుతోంది. ఇప్పటికే టీం ఇండియా మాజీ క్రికెటర్ పియూష్ చావ్లా, ఆర్పీ […]
తెలంగాణలో కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3982 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,36,766 కి చేరింది. ఇందులో 4,85,644 మంది కోలుకొని డిశ్చార్జ్ […]
సహజీవనంపై హర్యానా, పంజాబ్ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సహజీవనం నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదని పేర్కొంది హై కోర్టు. ఇంటి నుంచి పారిపోయిన ఓ జంట తమకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా హై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషినర్లు గుల్జా కుమారి (19), గురువిందర్ (22) తార్న్ తరన్ జిల్లాకు చెందిన వారు. ఈ క్రమంలో వారు తాము కలిసి నివాసిస్తున్నామని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని పేర్కొన్నారు. […]
నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ తరుణంలో టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కస్టడీలో ఉన్నఎంపీని కొట్టి హింసించారని చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని..ఈ విషయంలో వారికి ఫస్ట్ ప్రైజు ఇవ్వవచ్చని ఎద్దేవా చేశారు. “కస్టడీలో ఉన్నఎంపీని కొట్టి హింసించారని చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా హోరెత్తించిన అసత్యపు […]
సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ప్రకటించినందుకు చాలా సంతోషమని..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్ కు కృతజ్ఞతలు అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుండి సంగారెడ్డి మెడికల్ కాలేజీ కోసం తాను పోరాటం చేస్తున్న సంగతి ప్రజలకు తెలుసని.. దాదాపు 10 నియోజకవర్గాల ప్రజలతోపాటు భీదర్ నుండి వచ్చే ప్రజలకు సంగారెడ్డి లో మెడికల్ కాలేజీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గెలిచిన తర్వాత అసెంబ్లీలో సమయం వచ్చిన ప్రతిసారి మెడికల్ కాలేజ్ ఇవ్వాలని సీఎంను […]
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై మరోసారి కౌంటర్ వేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ సర్కార్ అన్ని విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికనే పోస్టులు భర్తీ చేస్తుందని పేర్కొన్న వైఎస్ షర్మిల.. సిఎం పదవిని కూడా కాంట్రాక్టు పద్దతిన చేపట్టాలని కెసిఆర్ కు చురకలు అంటించారు. “అన్నింటా కాంట్రాక్ట్ పోస్టులే అయితే .. ఇక సిఎం పదవి కూడా కాంట్రాక్టు కింద పెట్టుకుంటే పోలే ..” అని ముచ్చట చెప్పిన కెసిఆర్ సారుకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలే ముద్దుగా కనిపిస్తున్నాయి, […]
హైదరాబాద్ కు చెందిన ఓ ఎఆర్ మహిళ కానిస్టేబుల్ హనీ ట్రాప్ చేస్తోంది. డబ్బులు ఉన్నవారిని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో డబ్బులు దండుకుంటుంది మహిళ కానిస్టేబుల్ సంధ్య రాణి. పోలీస్ డిపార్ట్మెంట్ పేరు చెప్పుకొని బెదిరిస్తున్న సంధ్య రాణి..ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా డ్యూటీ నిర్వహిస్తున్నది. గతంలో ముగ్గురిని పెళ్లి చేసుకొని డివోర్స్ ఇచ్చిన లేడీ కానిస్టేబుల్..ఇద్దరికి డివోర్స్ ఇవ్వగా.. మరొకరు ఆమె వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా షాబాద్ మండలం […]
జూనియర్ డాక్టర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ఇవాళ ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందించారు. జూనియర్ డాక్టర్లకు 15 శాతం స్టైఫండ్ పెంచుతూ ఇవాళ ఉత్తర్వులు జారీ అవుతాయని ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. స్నేహ సోమారెడ్డి అనే వైద్యురాలు జూనియర్ డాక్టర్ల సమస్యలపై ఇవాళ కేటీఆర్‌కు ట్వీట్ చేసింది. దీంతో మంత్రి కేటీఆర్ ఆమె ట్వీట్ కు బదులు ఇచ్చారు. హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల సమస్యలను […]