తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని సిఎం కెసిఆర్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ. అయితే కెసిఆర్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై బిజేపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఆయుష్మాన్ భారత్ లో చేరాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని… రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలన్న డిమాండ్ తో రేపు చేపట్టిన ” గరీబోళ్ల కోసం బిజెపి దీక్ష” ను వాయిదా వేస్తున్నామని బండి సంజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో అమలు చేయాలని బిజెపి వివిధ మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం పై చేసిన ఒత్తిడి ఫలించిందని… ఆయుష్మాన్ భారత్ లో చేరాలని ఆలస్యంగానైనా తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేయడంతో పాటు పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.