తెలంగాణలో మరింత లాక్ డౌన్ అమలు అవుతోంది. లాక్‌డౌన్ అమలుపై సీపీ, ఐజీ, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు. లాక్‌డౌన్‌పై జిల్లాల వారీగా సీఎం కేసీఆర్ రోజూ సమీక్షిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఒక్కసారిగా నిత్యావసరాల కోసం బయటకు వస్తున్నారన్న డీజీపీ… అందరూ ఒకేసారి రావడం వల్లే మార్కెట్లు, దుకాణాల వద్ద రద్దీ ఏర్పడుతోందని పేర్కొన్నారు. కమిషనర్ నుంచి ఏసీపీ స్థాయి అధికారి వరకు రహదారులపై తిరగాలని డీజీపీ సూచించారు. చేపలు, మార్కెట్ల వద్ద గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డీజీపీ ఆదేశాలతో.. నేటి నుండి మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు పోలీసులు. 10గంటల తరువాత రోడ్ల మీదే తిరిగే వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు పోలీసులు. 10 గంటల తరువాత పాస్ ఉన్న వారికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనాలపై సీరియస్ గా వ్యవహరిస్తున్నారు పోలీసులు.