ముఖ్యమంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోకపోతే ఎలా ? : సిఎం జగన్ పై లోకేష్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ ఏపీ బడ్జెట్ సమావేశాలను జగన్ సర్కార్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా అసెంబ్లీలో..సిఎం జగన్ మాస్కు లేకుండా దర్శనం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సిఎం జగన్ పై టిడిపి నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఏపీలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయని.. ఇలాంటి సమయంలో సిఎం జగన్ మాస్క్ పెట్టుకోకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోకపోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధరిస్తారు? అంటూ సిఎం జగన్ కు చురకలు అంటించారు నారా లోకేష్. “ముఖ్యమంత్రి గారూ! మాస్క్ ధరించడం తప్పనిసరి అని మీ ఫోటో, పేరుతో కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చిన మీరు మాస్క్ ధరించకుండా ప్రజలకు ఏం సంకేతాలిస్తున్నారు? ముఖ్యమంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోకపోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధరిస్తారు? తొలి విడతలో కోవిడ్ వైరస్ చిన్నపాటి జ్వరం లాంటిదేనని, పారాసెటమాల్ వేస్తే పోద్ది, బ్లీచింగ్ చల్లితే చస్తుంది ..ఇట్ కమ్స్ ఇట్ గోస్..ఇట్ షుడ్‌బీ నిరంతర ప్రక్రియ, సహజీవనం అంటూ ఫేక్ మాటలతో వేలాది మందిని బలిచ్చారు. సెకండ్‌వేవ్‌లో రాష్ట్రం శ్మశానంగా మారుతుంటే చిరునవ్వులు చిందిస్తూ,మీరే మాస్క్ ధరించకుండా ఇంకెన్ని వేలమంది ప్రాణాలు పణంగా పెడతారు? మాస్క్ లేకుండా మూర్ఖుడిగా ఉంటారో, మాస్క్ వేసుకుని మనిషినని నిరూపించుకుంటారో మీ ఇష్టం సిఎం జగన్.” అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు.
Also Read
- Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
- Pawan Kalyan - Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
- Tags
- ap
- assembly
- Covid19
- mask
- Nara Lokesh
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!