ఏపీ ప్రభుత్వం ఎల్లుండి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరోనా కష్ట కాలంలో బడ్జెట్ రూపకల్పన కత్తి మీద సాములా మారింది. రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.38 లక్షల కోట్ల మధ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతేడాది అనుభవాలతో ఆదాయ, వ్యయాల అంచనాలను రూపొందిస్తోంది ఆర్ధిక శాఖ. గతేడాది ఆదాయ అంచనాలను చేరుకోలేకపోయిన ఏపీ…గత ఏడాది సుమారు 1.82 లక్షల […]
తౌక్టే తుఫాన్ తో ఇప్పటికే కేరళ వణికిపోతుంది. తరుముకొస్తున్న ఈ తుఫాన్ ఆరు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడులో వర్షాలు పడనున్నట్లు తెలిపింది. అయితే తౌక్టే తుఫాను తెలంగాణా రాష్ట్రం నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు తెలంగాణా రాష్ట్రంలో దక్షిణ దిశ నుండి వీస్తూన్నాయి. రాగల 3 రోజులు (18,19,20వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులుతో కూడిన […]
తెలంగాణ ప్రభుత్వంపై సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. తెలంగాణలో పరిపాలన కోమాల్లో ఉందని..పక్క రాష్ట్రం తమిళనాడులో ప్రతిపక్ష నాయకులతో కమిటీ వేశారని చురకలు అంటించారు. తెలంగాణ సర్కార్ ఇకనైనా ఒంటెద్దు పోకడలు మానుకోవాలని.. కరోనా అందరినీ కబలిస్తుందన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ కూడా అందివ్వడం లేదని.. కేటీఆర్ కు టాస్క్ ఫోర్స్ బాధ్యత ఇవ్వగానే వ్యాక్సిన్ వేయడమే మానేశారని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో కేసులు పెరుగుతున్నా పరీక్షలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ […]
ఎంపి రఘురామకృష్ణంరాజు అరెస్టు వివాదం ఇప్పుడు పూర్తిగా సుప్రీం కోర్టు చేతుల్లోకి వెళ్లిపోవడం వూహించిన పరిణామమే. ఆయనను ఎపి సిఐడి పోలీసులు దర్యాప్తు సందర్భంలో కొట్టారో లేదో తేల్చడానికి సికిందరాబాదులోని ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని అత్యున్నత న్యాయస్తానం ఆదేశించింది. తాను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఆయనను అక్కడే కొనసాగించాలని కూడా స్పష్టం చేసింది. ఈ వైద్య పరీక్షల ఖర్చు ఎంపినే భరించాలని కూడా చెప్పడం కొసమెరుపు. ఏమైనా ఇప్పుడు అరెస్టును మించి ఆయనను కొట్టారా లేదా అన్నది […]
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసి భవిష్యత్ లో కూడా ఎలాంటి ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అదనంగా ఇంకా 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 16 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 6 యూనిట్లు, […]
తెలంగాణలో కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,961 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,32,784 కి చేరింది. ఇందులో 4,80,458 మంది కోలుకొని డిశ్చార్జ్ […]
ఎంపి రఘురామకృష్ణరాజుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ. రఘురామరాజు ఒక మానసిక రోగి అని…ఆయనకు ముందు మానసిక వైద్యం చేయించాలని ఆయన ఎద్దేవా చేశారు. ఎం.పీగా గెలిచిన తర్వాత నరసాపురం నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమీ లేదని..దమ్ముంటే ఎం.పీ పదవికి రాజీనామా చేసి, తిరిగి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఎవరి ప్రోద్భలంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారో ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలవాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ గారిని, పార్టీ పెద్దలను, […]
తెలంగాణ ఎంసెట్ పరీక్షకు ఇప్పటి వరకు దరఖాస్తు చేయని విధ్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కెసిఆర్ సర్కార్. తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువు ఈ నెల 26 వరకు పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. ఇక ఇప్పటికే లక్ష 50 వేలు దాటాయి తెలంగాణ ఎంసెట్ దరఖాస్తులు. ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో లక్షా 6 వేల 506 దరఖాస్తులు రాగా.. […]
సిఎం కెసిఆర్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకున్నారా ? వ్యాక్సిన్ తీసుకుంటే.. ఫోటో కూడా ఎందుకు విడుదల చేయలేదు ? అని మండిపడ్డారు. కేసీఆర్‌కు కేంద్రాన్ని విమర్శించే అర్హత లేదని.. టాస్క్‌ఫోర్స్ కమిటీ వేసి కలక్షన్స్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. 20 కోట్ల వ్యాక్సిన్లను ఉచితంగా రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసింది… రానున్న 3 రోజుల్లో మూడు లక్షల డోసులు రానున్నాయన్నారు. తెలంగాణకు […]
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపింది. వేములవాడలోని జాతర గ్రౌండ్ కు చెందిన 25 సంవత్సరాల యువకుడు మృతి బ్లాక్ ఫంగస్ తో మృతి చెందినట్లు సమాచారం. అలాగే వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామానికి చెందిన 52 సంవత్సరాల మహిళలో కూడా బ్లాక్ ఫంగస్ గుర్తించారు వైద్యులు. హైదరాబాదులోని పలు ఆస్పత్రుల్లో తిరిగిన రోగిని తీసుకునేందుకు నిరాకరించారు వైద్యులు. సంగారెడ్డిలోని పద్మావతి హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం ఆ మహిళను అడ్మిట్ చేశారు […]