టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. చంద్రబాబు బతుకు అంతా.. అన్నీ దొంగ మాటలు, డొల్లతనమేనని పేర్కొన్నారు. ఈ జీవి జీవితమే అంత అని… వినేవాడుంటే- చార్మినార్ కూడా నేనే కట్టా అని చద్రబాబు అంటాడని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. “ఇదీ హైదరాబాద్ లో జెనోమ్ వ్యాలీ తానే పెట్టాను అంటూ పదే పదే డబ్బా కొట్టే ఫేక్ విజనరీ, మీడియా మేడ్ మాన్ చంద్రబాబు బతుకు – అన్నీ దొంగ మాటలు, డొల్లతనమే. ఈ జీవి జీవితమే అంత. వినేవాడుంటే – చార్మినార్ కూడా నేనే కట్టా అంటాడు చంద్రం. ‘పార్టీ లేదు బొక్కా లేదు’ అని అచ్చెన్న ముందే చెప్పాడు. చికాకులో నోరు జారి ఉంటాడని అనుకున్నారు కొందరు. అది నిజమేనని తెలియడం లేదూ. పరిషత్తు ఎన్నికల బహిష్కరణ, తాజాగా అసెంబ్లీ సెషన్ బాయ్ కాట్ చేస్తున్నట్టు బాబు ప్రకటించడం, సంకేతాలు అవే కదా.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
ఇదీ హైదరాబాద్ లో జెనోమ్ వ్యాలీ తానే పెట్టాను అంటూ పదే పదే డబ్బా కొట్టే ఫేక్ విజనరీ, మీడియా మేడ్ మాన్ చంద్రబాబు బతుకు – అన్నీ దొంగ మాటలు, డొల్లతనమే. ఈ జీవి జీవితమే అంత. వినేవాడుంటే – చార్మినార్ కూడా నేనే కట్టా అంటాడు చంద్రం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 20, 2021