యాదాద్రి భువనాగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే రాజాగోపాల్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి లు వేదిక పైకి రాగానే ఇరు వర్గాల కార్యకర్తలు హోరా హోరీగా నినాదాలు చేశారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించడం లేదని కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన చేయడంతో… ఇరు పార్టీ కార్యకర్తల నినాదాల మధ్య రసాభాసగా మారింది రేషన్ కార్డుల […]
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ. హర్యాణా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నేడు ఢిల్లీ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు బండారు దత్తాత్రేయ. ఈ సందర్భంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ క్షేమ సమాచారాన్ని అడిగి తెలుకున్నారు ప్రధాన మంత్రి. అలాగే… హరియాణా రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న ప్రధాని… కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో గవర్నర్లు క్రియాశీలక […]
సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు ఎం.పీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలని… పంటల బీమా అమలు కాకపోవడానికి తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలని… కొత్తగా పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్ ఫుడ్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తదుపరి పంటల నుంచి ప్రభుత్వం ప్రీమియం చెల్లించి […]
పదవీ విరమణ వయస్సు 61 యేండ్లకు పెంపు పై సింగరేణి భవన్ లో సీఎండీ శ్రీధర్ అధ్యక్షతన బోర్డు సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో పదవి విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచుతూ ఈ సందర్భంగా బోర్డు నిర్ణయం తీసుకుంది. బోర్డు నిర్ణయం ప్రకారం… పెంచిన వయస్సు మార్చి 31, 2021 నుండి అమల్లోకి రానుంది. అలాగే మార్చి 31 జూన్ 30వ తేదీ మధ్య కాలంలో రిటైర్మెంట్ తీసుకున్న 39 […]
”దళిత బంధు పథకం’’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయంతో వారికిష్టమైన పరిశ్రమను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకోవాలని…’దళితబంధు’ కేవలం కార్యక్రమం కాదు ఉద్యమం అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ దళిత సమాజం వ్యాపార వర్గం గా అభివృద్ది చెందాలని.. గ్రామాల్లోని ఇతర వర్గాలు దళితుల వద్దకే అప్పుకోసం వచ్చే దిశగా దళితుల ఆర్థిక సాధికారత సాధించాలని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను అమలులోకి తెచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం దళితాభివృద్ధి కోసం […]
కాకతీయుల కళాత్మక వైభవానికి చిహ్నం, 800 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదా సాధించేందుకు కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదపడంతో చైనాలో జరిగిన యునెస్కో సమావేశం ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో కొలువైన ప్రఖ్యాత రామప్ప ఆలయానికి అంతర్జాతీయ […]
హుజురాబాద్ సిటీ సెంటర్ హల్ లో కేబుల్ ఆపరేటర్స్ – హమాలి సంఘ సభ్యులతో తెలంగాణ మంత్రి గంగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆపదలో, ఆకలితో ఉన్నవారిని ఆధుకునే మంచిమనుసు సీఎం కేసీఆర్ ది అని.. కేబుల్ ఆపరేటర్లు, హమాలీలను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. అర్హులైన కేబుల్ ఆపరేటర్లకు, హమాలీలకు అతి త్వరలో డబుల్ బెడ్రూం, బీమాసౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఈటెల ఏనాడు హుజురాబాద్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ను అడగలేదని… […]
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ని కత్తి కార్తీక కలిశారు. ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా మధుయాష్కీకి శుభాకాంక్షలు తెలిపారు కత్తి కార్తీక. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఈ సందర్భంగా కత్తి కార్తీకను ఆహ్వానించారు మధుయాష్కీ. అయితే.. ఈ ఆఫర్ పైకత్తి కార్తీక సుముఖత వ్యక్తం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అటు ఈ అంశంపై రేవంత్ రెడ్డితో మధుయాష్కీ చర్చించినట్లు సమాచారం. బీసీ మహిళ, తెలంగాణ ప్రజలకు సుపరిచితురాలైన కత్తి కార్తీకను పార్టీలోకి […]
తెలంగాణలో కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి..తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 494 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… మరో నలుగురు మృతి చెందారు.. ఇదే సమయంలో 710 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,41,153 కు చేరుకోగా.. ఇప్పటి వరకు 6,27,964 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. మృతుల సంఖ్య 3,784కు పెరిగింది. దేశవ్యాప్తంగా రికవరీ […]
కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్లో తిరిగి ప్రారంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ మరియు మూడుసార్లు ఐపీఎల్ విజేత గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ రెండో దశ మ్యాచ్ లు పునః ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 10న జరిగే తొలి క్వాలిఫయర్ కు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుండగా… అదే నెల 11, 13 వ తేదీల్లో జరిగే ఎలిమినేటర్, 2వ క్వాలిఫయర్ మ్యాచ్ […]