ప్రధాని మోడీకి బండి సంజయ్ కృతజ్ఞతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకతీయుల కళాత్మక వైభవానికి చిహ్నం, 800 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదా సాధించేందుకు కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదపడంతో చైనాలో జరిగిన యునెస్కో సమావేశం ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో కొలువైన ప్రఖ్యాత రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు. రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడానికి సంబంధించి నామినేషన్ 2019లో దాఖలు కాగా, అదే ఏడాది రామప్పను సందర్శించిన ‘అంతర్జాతీయ స్మారకాలు, స్థలాల మండలి (ఐసీవోఎంవోఎస్)’ తొమ్మిది లోపాలను ఎత్తిచూపిందని తెలిపారు. దీంతో భారత్ దౌత్యపరమైన చర్యలకు ఉపక్రమించి ప్రపంచ వారసత్వ కమిటీ (డబ్ల్యూహెచ్‌సీ) ఓటింగ్‌లో పాల్గొననున్న దేశాలకు రామప్ప గొప్పతనాన్ని వివరించిందన్నారు. దానికి యునెస్కో గుర్తింపు దక్కాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పిందని… దీంతో రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపద హోదా లభించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కృషితోనే రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు సాధ్యమైందని పేర్కొన్నారు.
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!