ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు దూసుకుపోతోంది. పూల్ -ఏ మూడో మ్యాచ్ లో 3-0 తేడాతో స్పెయిన్ పై ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్ లోనే అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్ చేసి.. మ్యాచ్‌ను తన చేతుల్లోకి తీసుకుంది ఇండియా. నాలుగో క్వార్టర్ లో మూడో గోల్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. రూపిందర్ పాల్ రెండు గోల్స్ తో సత్తా చాటగా… 14 […]
హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే గులాబీ బాస్ సీఎం కేసీఆర్.. సంక్షేమ పథకాలు దృష్టిసారించగా… అటు మంత్రి కేటీఆర్… పార్టీ భవిష్యత్తు కార్యచరణపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యలోనే టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో మంత్రి కేటీఆర్ ఇవాళ సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనుంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణం, పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలకు బీమా […]
తూర్పుగోదావరి జిల్లా : గోదావరి వరద ప్రవాహం శాంతించినట్లు కనిపిస్తోంది. దీంతో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. గౌతమి, వృద్ధగౌతమి, వైనతేయ, వశిష్ఠ నదీపాయలలో శాంతించి క్రమంగా తగ్గుముఖం పట్టింది వరద. ఇక అటు పి.గన్నవరం మండల పరిధిలోని గంటిపెదపూడి శివారు బూరుగులంక, పెదపూడిలంక, అరిగెలవారిపేట, ఊడిమూడి శివారు ఊడిమూడిలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. read also : మహిళలకు షాక్… మళ్లీ పెరిగిన బంగారం ధరలు అధికారులు ఏర్పాటు చేసిన రెండు ఇంజన్ పడవలపైనే […]
శ్రీశైలం జలాశయానికి వరద వరద ఉధృతి పెరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి ఎక్కువ నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 3,22,262 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 31,784 క్యూసెక్కులు గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 874.40 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 160.9100 టీఎంసీలు ఉంది. […]
మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. సిద్ధిపేట ఔటర్ బైపాస్ పైన, మెడికల్ కాలేజీ దగ్గరలో నిన్న రాత్రి బైక్ ఆక్సిడెంట్ చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తూ డివైడర్ కు ఢీ కొట్టి, తీవ్రంగా గాయపడ్డారు సిద్ధిపేటకు చెందిన ఇద్దరు ముస్లిం వ్యక్తులు. అయితే.. అదే సమయంలో సిరిసిల్ల పర్యటన ముగించుకున్న కేటీఆర్.. అదే మార్గంలో వచ్చారు. read also : మహిళలకు షాక్… మళ్లీ పెరిగిన బంగారం ధరలు ఈ నేపథ్యంలో […]
నలుపు నారాయణుడు మెచ్చు అంటారు. నలుపుతోనూ వలపుగేలం వేయవచ్చుననీ కొందరు నిరూపించారు. నలుపున్నా జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా గెలుపు చూసిన మేటి నటి అర్చన. ఎలా ఉంటేనేం? అర్చన అభినయంలో ఓ అందం ఉండేది. ఆ చూపుతోనే బంధాలు వేసే శక్తీ ఆమె సొంతమే! వాటిని మించి సుగంధాల వాసనలాంటి లావణ్యం అర్చనలో తిష్టవేసుకుంది. ఇన్ని లక్షణాలున్న తరువాత నలుపు, తెలుపుతో పనేంటి!? అర్చనను ‘బ్లాక్ బ్యూటీ’ అంటూ ఎందరో కీర్తించారు. వరుసగా రెండు సార్లు జాతీయ […]
ఎంత గొప్ప మేధావులైనా, జనం నాడి పట్టక పోతే లాభం లేదు – అంటారు. అసలు జనం నాడిని పట్టుకోవడమే పెద్ద విద్య! సదరు విద్యలో ఆరితేరిన వారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారే వరుస విజయాలు చూస్తారు. అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు అలాంటివారే! ఆయన దూరదృష్టి కారణంగానే, అక్కినేని నాగేశ్వరరావు మహానటుడు అనిపించుకోగలిగారు. దుక్కిపాటి తమ ‘అన్నపూర్ణ’ పతాకంపై జనం మెచ్చే చిత్రాలు తెరకెక్కించి పదికాలాల పాటు జనం మదిలో నిలచిపోయారు. ‘తన […]
ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికి ఉండదు. మన దేశ మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఎంతో ఇష్టపడతారు. అయితే… గత వారం రోజులుగా భారీగా పెరుగుతోంది. తాజాగా… పుత్తడి ధరలు ఈరోజు కూడా భారీగా పెరిగాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అనుకున్న వినియోగదారులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. […]
జూలై 26 విజయ్ దివస్! 1999 జూలై 26న పాకిస్తాన్ పై భారత సైనికులు పైచేయి సాధించారు. దానికి మూడు నెలల ముందు నుండి పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాన్ని తిరిగి సొంతం చేసుకున్న రోజు అది. దాదాపు అరవై రోజుల పాటు సాగిన కార్గిల్ యుద్ధంలో పాక్ సైనికులను, చొరబాటు దారులను అడ్డుకుని భారత సైన్యం విజయకేతనం ఎగరేసిన రోజు అది. 22 సంవత్సరాల క్రితం ఈ యుద్ధంలో కెప్టెన్ విక్రమ్ బాత్రా అమరుడయ్యారు. అతని జీవిత […]
కోట్లాదిమంది పెదాలపై మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన పాటలు ఇప్పటికీ నాట్యం చేస్తూనే ఉంటాయి. వేయికి పైగా చిత్రాలకు స్వరాలు సమకూర్చిన ఇళయరాజా నేటికీ అలుపుసొలుపు లేకుండా అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమా పాట ఎలా ఉండాలో అలతి పదాలతో వివరించారు ఇళయరాజా. అప్పుడే వికసించిన కుసుమంలా పాట ఉండాలంటారు ఇళయరాజా. అంతేకాదు… ఆ పాటను ఎప్పుడు విన్నా… అదే అనుభూతి శ్రోతలకు కలగాలంటారు. ఆయన పాటలలో అలాంటి తాజాదనం ఉంది కాబట్టే దశాబ్దాలు గడిచిన ఆ పాటలను […]