పదవీ విరమణ వయస్సు 61 యేండ్లకు పెంపు పై సింగరేణి భవన్ లో సీఎండీ శ్రీధర్ అధ్యక్షతన బోర్డు సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో పదవి విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచుతూ ఈ సందర్భంగా బోర్డు నిర్ణయం తీసుకుంది. బోర్డు నిర్ణయం ప్రకారం… పెంచిన వయస్సు మార్చి 31, 2021 నుండి అమల్లోకి రానుంది. అలాగే మార్చి 31 జూన్ 30వ తేదీ మధ్య కాలంలో రిటైర్మెంట్ తీసుకున్న 39 అధికారులు, 689 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోనుంది సంస్థ. పదవీ విరమణ వయస్సు 61 యేండ్ల పెంపుతో మొత్తం సింగరేణి అధికారులు, కార్మికులు 43 వేల 899 మంది కి లబ్ది చేకూరుతుంది. బోర్డు తీసుకున్న తాజా నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తీసుకు రానున్నారు.