మేషం : వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కొంటారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉద్యోగస్తులు అధికారులను మెప్పించడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. శారీరక శ్రమ, మానసికాందోళన వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితలవుతారు. వృషభం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలోను, అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. రావలసిన […]
టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా బాక్సర్ లవ్లినా బొర్గోహెన్ తన సత్తా చాటింది. తన కంటే బలమైన ప్రత్యర్థులను చిత్తు చేస్తూ క్వార్టర్స్ వరకు దూసుకొచ్చిన లవ్లినా.. కీలక మైన క్వార్టర్ ఫైనల్లోనూ దుమ్ములేపింది. చైనీస్ తైపీ బాక్సర్ అయిన చెన్ నైన్ చిన్‌పై అద్భుత విజయాన్ని దక్కించుకుంది. దీంతో ఇండియాకు టోక్యో ఒలింపిక్స్‌లో మరో పతకం ఖరారు అయింది. సెమీస్ లో ఓడినా.. లవ్లికాకు పతకం కచ్చితంగా రానుంది. కాబట్టి ఆమె ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా […]
ఫలితం అనుకూలంగా ఉంటే అంతా మా కృషే అని చంకలు గుద్దుకుంటారు. తేడా కొడుతుందని అనుమానం వస్తే మాత్రం దూరం జరుగుతారు. హుజురాబాద్ ఉపఎన్నిక విషయంలోనూ ఆ పార్టీలో అదే జరుగుతోందట. టచ్‌మీ నాట్ అన్నట్టు ఉంటున్నారట నాయకులు. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. హుజురాబాద్‌పై చర్చకు ఇష్టపడని కాంగ్రెస్ నేతలు! తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఎదో ఒక పంచాయితీ ఉంటూనే ఉంటుంది. సభలు సమావేశాలపై తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? మీరు అలా ఎలా […]
CPI నారాయణ స్టయిలే వేరు. ఎప్పుడు ఎక్కడ ఉంటారో.. ఎవరి మీద విరుచుకుపడతారో ఎవరికీ అర్థం కాదు. అలాంటి నారాయణకు ఒక్కటే కోరిక మిగిలిపోయిందట. ఇప్పటికీ అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈసారి మాత్రం గట్టిప్లాన్‌తో వర్కవుట్ చేయాలని అనుకుంటున్నారట ఆ కామ్రేడ్. అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేయాలని కలలు! సీపీఐ నారాయణ ఏం చేసినా సంచలనమే. ఆయన చేసిన పనులు క్షణాల్లో వైరల్ అవుతాయి. తాజా రాజకీయ పరిణామాలపై స్పందిస్తు మెయిన్ స్ట్రీమ్‌లో […]
ఒక్క ఉపఎన్నిక.. అక్కడి ఉమ్మడి జిల్లాలోని అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోందా? కలెక్టర్ నుంచి సీపీ వరకు ఆకస్మిక బదిలీల వెనక కారణాలు అవేనా? సీనియర్ ఐపీఎస్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయడాన్ని ఎలా చూడాలి? ఉద్యోగ, రాజకీయవర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! కరీంనగర్ సీపీ బదిలీపై రాజకీయ వర్గాల్లో చర్చ! తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నిక రాజకీయపార్టీల్లో సెగలు రేపుతుంటే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ అధికారుల కుర్చీలు కదిలిస్తోంది. కలెక్టర్లు.. ఐపీఎస్‌లను ఉన్నపళంగా బదిలీ […]
అమెరికాలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంతో ఆ మధ్య వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కన్పించినా.. గత కొన్ని రోజులుగా మళ్లీ విజృంభిస్తోంది. అమెరికాలో 24 గంటల వ్యవధిలో 88 వేల 376 కేసులు వెలుగు చూశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవడం ఇదేసారి. కరోనా టీకా పంపిణీలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 55శాతానికి మించి కనీసం […]
ఇండియాలో కరోనా కేసులు ఇంకా భారీగానే నమోదు అవుతున్నాయి.. గడిచిన మూడు రోజుల నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా కొత్తగా 44,230 మందికి పాజిటివ్‌గా తేలింది.. మృతుల సంఖ్య కూడా పెరిగిపోయింది.. ఒకే రోజు 555 మంది ప్రాణాలు కోల్పోయారు. read also : హైదరాబాద్ లెమన్‌ట్రీ హోటల్లో ప్రేమజంట సూసైడ్ దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3.15 కోట్లకు చేరగా.. 4,23,217 […]
కడపజిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లెలో బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. వైసిపికి చెందిన ముగ్గురు, బిజెపీకి చెందిన ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో బిజెపీకి చెందిన ముగ్గురు కార్యకర్తల పరిస్థితి విషమంగా ఉంది. బీజేపీ కార్యకర్తలు గోపు ప్రసాద్, చిన్న నరసింహులు, పెద్ద నరసింహులు గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలు నరేంద్ర, ఆంజనేయులు గాయపడగా…ఈ ఘర్షణలో గ్రామ వాలంటీర్ వెంకటేష్ కూడా గాయాలయ్యాయి. read also : హైదరాబాద్ […]
హైదరాబాద్ లెమన్ ట్రీ హోటల్‌లో ప్రేమ జంట ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నమే రూమ్ ఖాళీ చేసి వెళ్లాల్సి ఉండగా.. మరోరోజు ఉంటామని చెప్పినట్లు హోటల్ సిబ్బంది చెబుతున్నారు.మృతులు మహబూబ్‌నగర్‌కు చెందిన రాములు, సంతోషి గా గుర్తించారు. రూమ్ బాయ్ వెళ్లినప్పుడు ఇద్దరూ గొడవ పడుతున్నట్టు సమాచారం. కోపంతో సంతోషి గొంతుకోసి బాత్‌రూమ్‌లో పడేసిన రాములు… తర్వాత ఫ్యాన్‌కు […]